సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట మాస్ సాంగ్ భారీ సెట్ లో షూటింగ్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’షూటింగ్ చివరి దశలో ఉంది.పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఆర్‌ఎఫ్‌సిలో జరుగుతోంది.

 Superstar Mahesh Babu S Sarkaru Vaari Paata Mass Song Shooting In A Massive Set-TeluguStop.com

షూటింగ్ లో బాగంగా ఒక మాస్ సాంగ్ ని భారీ సెట్ లో చిత్రీకరిస్తున్నారు.దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.

ఈ చిత్రానికి ఎస్ థమన్ చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను అందించారు.ప్రస్తుతం ఈ సినిమాలోని రెండు పాటలు విడుదలై సూపర్ హిట్స్ గా నిలిచాయి.

ప్రస్తుతం మహేష్ బాబు, కీర్తి సురేష్ , డ్యాన్సర్లపై చిత్రీకరిస్తున్నపాట మాస్ సాంగ్ గా ఉండబోతుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకి కొరియోగ్రఫీ చేస్తున్నారు.

షూటింగ్ లో బాగంగా యూనిట్ లొకేషన్ స్టిల్స్ ని విడుదల చేశారు.కాళ్ళకి రెడ్ కర్ట్చీప్ కట్టుకొని మహేష్ చాలా మాస్ గా ఇందులో కనిపించారు.

ఈ పాట కోసం ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ భారీ సెట్‌ని వేశారు.మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపైనవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ కథానాయిక.ఆర్ మధి సినిమాటోగ్రఫర్ గా, మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

భారీ అంచనాలు నెలకొన్న ‘సర్కారు వారి పాట’ మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.తారాగణం: మహేష్ బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు తదితరులు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube