మెగాస్టార్ చిరంజీవి ప్రెసెంట్ కుర్ర హీరోలు కూడా చేయలేనంత స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.ఈయన ఇది వరకు ఏడాదికి ఒక సినిమా మాత్రమే చేసేవాడు.
కానీ ఇప్పుడు అలా కాదు ఒకటి పూర్తి అవ్వకుండానే మరొకటి చేస్తూ ఫుల్ స్పీడ్ గా ఉన్నాడు.ప్రెసెంట్ చిరంజీవి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఆచార్య సినిమాను రిలీజ్ కు రెడీగా ఉంచాడు.
ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉంది.ఇందులో రామ్ చరణ్ కూడా సిద్ధ అనే పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించాడు.
చిరు కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తే రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటించింది.ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ప్రొమోషన్స్ స్పీడ్ గా చేయాలనీ మేకర్స్ నిర్ణయించారు.
దీంతో వరుసగా ఈ సినిమా నుండి అప్డేట్ లు ఉండేలా చూసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవలే ఈ సినిమా నుండి ట్రైలర్ రిలీజ్ చేసారు.
ఈ ట్రైలర్ చూసిన మెగా ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోయారు.

సినిమాలో యాక్షన్ ఏ లెవల్ లో ఉంటుందో మచ్చుకకు కొన్ని సీన్స్ చూపించాడు కొరటాల.రామ్ చరణ్ తండ్రి చిరంజీవి తో కలిసి పూర్తి స్థాయిలో నటించిన సినిమా ఇది.ట్రైలర్ తోనే అంత ఉత్సాహం ఇచ్చి సినిమాపై అంచనాలు పెంచేశారు.

ఇక తాజాగా ఈ సినిమా నుండి మరొక సాంగ్ ను రిలీజ్ చేసారు.మణిశర్మ అందించిన సంగీతం ఈ సాంగ్ ను మరో లెవల్ లో నిలబెట్టింది.నిన్న సాయంత్రం రిలీజ్ అయినా భలే భలే బంజారా సాంగ్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఈ సాంగ్ 20 గంటల్లోనే 60 లక్షలకు పైగా వ్యూస్ రాబట్టి 2.6 లక్షల లైక్స్ తో అదరగొడుతుంది.ఈ సాంగ్ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ను అలరిస్తుంది.
చిరు, చరణ్ ఒకే పాటలో డ్యాన్స్ చేయడం మెగా ఫ్యాన్స్ కు కన్నుల పండుగగా అనిపిస్తుంది.







