టెస్లా, SpaceX CEO ఎలోన్ మస్క్‌కి వాహనాలంటే ఎంతో ఇష్టం.కొత్త టెక్నాలజీని ఆవిష్కరించిన ఎలోన్ మస్క్.
జేమ్స్ బాండ్‌కి వీరాభిమాని.ఈ కారణంగా సినిమాల నుండి ప్రేరణ పొంది అతను 1976 లోటస్ ఎస్ప్రిట్ 007 వెట్ నెల్లీని కొనుగోలు చేశాడు.
ఈ కారును చిత్రనిర్మాతలు నీటి అడుగున చిత్రీకరించడానికి వినియోగించారు.మస్క్‌కి ఈ కారుపై వ్యామోహం పెరిగింది.అతను 2013 సంవత్సరంలో ఈ కారు వేలంలో పాల్గొని సుమారు $ 1 మిలియన్ (సుమారు రూ.7.5 కోట్లు)కి కొనుగోలు చేశాడు.తన సైబర్‌ట్రక్ డిజైన్, బ్లేడ్ రన్నర్, లోటస్ ఎస్ప్రిట్ నుండి ప్రేరణ పొందానిని ఎలాన్ మస్క్ తెలిపాడు.
ది స్పై హూ లవ్డ్ మిలో జేమ్స్ బాండ్ సినిమాలో లోటస్ ఎస్ప్రిట్ ఉపయోగించారు.ఇది జలాంతర్గామిలా కూడా పనిచేస్తుంది.ఎలోన్ మస్క్ లోటస్ ఎస్ప్రిట్ కాకుండా అనేక కార్లను సేకరించాడు.
మస్క్‌కి తన సొంత కంపెనీ టెస్లా కార్లు కూడా ఉన్నాయి.
టెస్లా మోడల్ ఎస్ పనితీరు నచ్చి తాను దీనిని ఎక్కువగా నడుపుతున్నట్లు వెల్లడించాడు.ఇది కాకుండా మస్క్.టెస్లా మోడల్ X SUVని కూడా ఉపయోగిస్తారు.కంపెనీకి చెందిన రెండవ కారు.
టెస్లా సైబర్‌ట్రక్‌ను కూడా స్పేస్‌ఎక్స్ అధికారులు ఉపయోగిస్తున్నారు.మస్క్ దగ్గర టెస్లా రోడ్‌స్టర్ కూడా ఉంది.
ఇతర ఖరీదైన వాహనాలను కూడా ఎలోన్ మస్క్ దగ్గర ఉన్నాయి.ఎలోన్ మస్క్ దగ్గర 2012 పోర్స్చే 911 టర్బో కూడా ఉంది.
పోర్షే 911 డ్రైవింగ్‌ను తాను ఎంతగానో ఇష్టపడుతున్నట్లు మస్క్ తెలిపాడు.తన ఆల్-టైమ్ ఫేవరెట్ కారు పోర్స్చే 911 టర్బో అని తెలిపాడు.
మస్క్.టర్బో 911 మోడల్‌కి అభిమాని.
మస్క్ తన సేకరణలో క్లాసిక్ 1920 ఫోర్డ్ మోడల్ టి కారును కూడా కలిగి ఉన్నాడు.మస్క్ 1967 జాగ్వార్ ఇ-రకాన్ని కూడా ఉపయోగిస్తున్నారు.
అతను 17 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడే ఈ కారుపై ఇష్టం పెంచుకున్నారు.అది అతని డ్రీమ్ కార్‌గా మారింది.
ఆ తరువాత దానిని కొనుగోలు చేశాడు.మస్క్ BMW అభిమాని.
ఫలితంగా అతని కార్ల సేకరణలో 2006 హమాన్ BMW M5 చేరింది.







