సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇతను భాషతో సంబంధం లేకుండా తన నటనతో, స్టైల్ తో కోట్లాది మంది ప్రేక్షకులను మనసులో స్థానం సంపాదించుకున్నాడు.
నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకుందాం.అయితే కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు,కన్నడ, మలయాళం ఇండస్ట్రీలలో కూడా రజినీకాంత్ కు బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది.
తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా చాలామంది అగ్ర హీరోలతో కలిసి నటించాడు.అలా టైగర్ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి నటించాడు.
ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ మెయిన్ హీరోగా నటిస్తే రజనీకాంత్ సెకండ్ లీడ్ గా నటించారు.కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సూపర్ స్టార్ రజినీకాంత్ ఇద్దరూ మంచి మిత్రులు అన్న విషయం అందరికి తెలిసిందే.
ఇద్దరు కలిసి పెదరాయుడు సినిమాల్లో నటించారు.శోభన్ బాబుతో కలిసి జీవన్ పోరాటం సినిమాలో నటించాడు.
హీరో కృష్ణతో కలిసి ఇద్దరూ అసాధ్యులే సినిమాలో నటించాడు.మెగాస్టార్ చిరంజీవితో కలసి కాళీ, బందిపోటు సింహం లాంటి సినిమాల్లో నటించారు.
అలాగే మమ్ముట్టితో కలిసి దళపతి సినిమాలో నటించారు.

మోహన్ లాల్ తో కలసి కుచేలన్ సినిమాలో నటించారు.అమితాబ్ బచ్చన్ తో కలసి బ్లైండ్ లాన్, హమ్ లాంటి సినిమాలలో నటించారు.సునీల్ శెట్టి తో కలసి దర్బార్ సినిమాలో నటించారు.రోబో 2.0 అక్షయ్ కుమార్ తో కలిసి నటించారు.అలాగే చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో షారుఖ్ ఖాన్ తో కలిసి నటించాడు.హృతిక్ రోషన్ తో కలసి భగవాన్ దాదా సినిమాలో నటించాడు.దివంగత కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ తో కలసి మంత్రాలయ రాఘవేంద్ర స్వామి మహత్మే సినిమాల్లో నటించారు.ఇలాదివంగత నటుడు అంబరీష్, ధర్మేంద్ర, వినోద్ ఖన్నా లాంటి అగ్ర హీరోలతో కలిసి నటించారు.