తమిళ్ లో రిలీజ్ కానున్న 'సర్కారు వారి పాట'.. టైటిల్ ఏంటంటే?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా తెరకెక్కిన విషయం విదితమే.

భారీ బడ్జెట్ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి చార్ బస్టర్ గా నిలిచాయి.అలాగే వచ్చిన పోస్టర్స్ కూడా ఆకట్టు కున్నాయి.

మహేష్ బాబు గత సినిమాల కంటే మరింత యంగ్ గా, చార్మింగ్ లుక్ తో అందరిని మెస్మరైజ్ చేస్తున్నాడు.ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుగుతుంది.

ఈ సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు, మైత్రి మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా.ఈ సినిమా సమ్మర్ కానుకగా మే 12న రిలీజ్ చేస్తున్నట్టు ఇటీవలే ప్రకటించారు.

Advertisement

అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ బయటకు వచ్చింది.

ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్ లో కూడా ఒకేసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.తమిళ్ లో మహేష్ బాబు కు మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే ఈయన నటించిన సినిమాలన్నీ అక్కడ డబ్ అవుతూనే ఉన్నాయి.

ఇక ఇప్పుడు సర్కారు వారి పాట సినిమా కూడా రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.

తమిళ్ లో ఈ సినిమాకి తాత్కాలికంగా పుదియ అరసాంగం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.తమిళ్ లో పుదియ అరసాంగం అంటే కొత్త ప్రభుత్వం అని అర్ధం.ఇక అక్కడ కూడా రిలీజ్ చేయనుండడంతో ప్రొమోషన్స్ స్టార్ట్ చేయనున్నారు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

తెలుగు ప్రొమోషన్స్ తో పాటుగా తమిళ్ టైటిల్, ట్రైలర్, పాటలు కూడా రిలీజ్ చేయనున్నారని సమాచారం.చూడాలి మరి మహేష్ ఈ సినిమాతో తమిళ్ లో ఎంత కలెక్షన్స్ రాబడతాడో.

Advertisement

తాజా వార్తలు