థియేటర్ లో మహేష్ మురారి మూవీ చూస్తూ పెళ్లి చేసుకున్న జంట.. ఏం జరిగిందంటే?

మహేష్ బాబు కృష్ణవంశీ కాంబినేషన్ లో తెరకెక్కిన మురారి మూవీ అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా తాజాగా రీరిలీజ్ కాగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు(super star mahesh babu ) అభిమానులు ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి తెగ ఆసక్తి చూపిస్తున్నారు.అయితే మహేష్ బాబు ఫ్యాన్ ఒకరు థియేటర్ లో మూవీ చూస్తూ పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.

అభిమాని పేరు తెలీదు కానీ నిజంగానే తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకోవడం సంచలనం అయింది.మహేష్ అభిమాని థియేటర్ లో పెళ్లి చేసుకోవడంతో మురారి మూవీ పేరు మరింత ఎక్కువగా మారుమ్రోగుతోంది.

మురారి(murari) సినిమాలోని పెళ్లి పాట ఏ రేంజ్ లో హిట్టైందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.పెళ్లి చేసుకున్న ఇద్దరూ మహేష్ బాబు అభిమానులు అని సమాచారం అందుతోంది.

Advertisement

థియేటర్ లో పెళ్లి జరగగా సినిమాకు హాజరైన అభిమానులు వాళ్లపై అక్షింతలు వేయడం గమనార్హం.సూపర్ స్టార్ మహేష్ బాబు (mahesh babu )పుట్టినరోజున అతని సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రాలేదు.రాజమౌళి(rajamouli) ఈ సినిమా అప్ డేట్స్ ఎప్పుడు ఇస్తారంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ జక్కన్న కాంబో మూవీ అంతకంతకూ ఆలస్యమవుతోంది.

సూపర్ స్టార్ మహేష్ బాబు రాజమౌళి(Mahesh Babu, Rajamouli) సినిమాతో దేశ విదేశాల్లో మంచి పేరును సొంతం చేసుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.900 నుంచి 1000 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కుతుండటం హాట్ టాపిక్ అవుతోంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు