మోకాళ్ళ నొప్పుల వల్ల నడవడానికి కూడా ఇబ్బందిగా ఉందా.. అయితే వెంటనే ఇలా చేయండి!

మోకాళ్ళ నొప్పులు( Knee pain ).ఇటీవల రోజుల్లో కోట్లాది మంది అత్యంత సర్వసాధారణంగా ఎదుర్కొనే సమస్య ఇది.

వయసు పైబ‌డిన వారే కాదు 30 ఏళ్ల వారు సైతం మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు.కొందరికి మోకాళ్ల నొప్పుల వల్ల నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఇక మెట్లు ఎక్కడం, కొద్దిసేపు స్టడీగా నిలబడటం అంటే గగనమే.మీరు కూడా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా.? అయితే వెంటనే ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ డ్రింక్ ను డైట్ లో చేర్చుకోండి.ఈ డ్రింక్ మోకాళ్ళ నొప్పులను తరిమి కొట్టడానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Advertisement

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు లేదా మూడు అశ్వగంధ రూట్స్( Ashwagandha Root ) తో పాటు అంగుళం దాల్చిన చెక్క( Cinnamon ) వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాసు పాలు పోసుకోవాలి.పాలు కాస్త హీట్ అవ్వగానే అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న అశ్వగంధ, దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి.

అలాగే అంగుళం దంచిన అల్లం( Ginger ) ముక్క, పావు టేబుల్ స్పూన్ జాజికాయ పొడి వేసుకొని ప‌ది నుంచి ప‌న్నెండు నిమిషాల పాటు మరిగించాలి.ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మరిగించిన మిల్క్ ను స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.ఈ మిల్క్ లో వన్ టేబుల్ స్పూన్ తేనె కలుపుకొని సేవించాలి.

మోకాళ్ళ నొప్పులను నివారించడానికి ఈ డ్రింక్ ఉత్తమంగా సహాయపడుతుంది.ఉదయం లేదా నైట్ నిద్రించే ముందు ఈ డ్రింక్ ను తీసుకుంటే ఎముకల సాంద్రత పెరుగుతుంది.

ఎముకలు గట్టి పడతాయి.అశ్వగంధ, అల్లం, దాల్చిన చెక్క మరియు జాజికాయ లో ఉండే ఔషధ గుణాలు మోకాళ్ళ నొప్పులను సమర్థవంతంగా నివారిస్తాయి.

కుమార్తె వ్యాఖ్యలు.. వేదికపై కంటతడి పెట్టిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
బీట్‌రూట్ ఆకుల‌తో ఇలా చేస్తే.. ఊడిన జుట్టు మ‌ళ్లీ వ‌స్తుంది!

కాబట్టి ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారో వారు తప్పకుండా ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోండి.మోకాళ్ళ నొప్పులకు బై బై చెప్పండి.

Advertisement

తాజా వార్తలు