భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన నటి సన్నీ లియోన్?

సన్నీలియోన్( Sunny Leone ) పరిచయం అవసరం లేని పేరు ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి పోర్న్ స్టార్ గా గుర్తింపు పొందారు.

ఇలా పలు సినిమాలలో నటించినటువంటి ఈమె దాదాపు కొంతకాలం నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇలా ఈమె సినిమాలకు దూరమైనప్పటికీ ఈమె పేరు చెప్పగానే పోర్న్ స్టార్ అనే ఆలోచన అందరికీ కలుగుతుంది.సినిమాలలో సరైన అవకాశాలు లేకపోవడంతో ఇండస్ట్రీకి ఈమె దూరమయ్యారు.

ఇండస్ట్రీలో కొనసాగుతున్న సమయంలో ఈమె ఇలాంటి వాంప్ పాత్రలలో చేసిన వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా మంచి పనులు చేసేవారు.

ఈమె ఏకంగా ఒక అనాధ బాలికను దత్తత తీసుకొని తన బాధ్యతలన్నిటిని చూసుకుంటున్నారు.ఇక సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి సన్నీ లియోన్ ప్రస్తుతం తన భర్తతో కలిసి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారని తెలుస్తుంది.ఇదే విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Advertisement

తన భర్తతో కలిసి ఈమె రెస్టారెంట్ బిజినెస్ ( Restaurant ) లోకి అడుగుపెట్టారు.

ఢిల్లీలోని చికలోక( Chica Loca ) అనే పేరిట రెస్టారెంట్ ప్రారంభించారు.తన రెస్టారెంట్లో వంట చేస్తూ ఉన్నటువంటి ఒక వీడియోని సన్నీ లియోన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.దీంతో ఈమె సినిమాలకు గుడ్ బై చెబుతూ రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టారనే స్పష్టంగా అర్థం అవుతుంది.

మరి రెస్టారెంట్ బిజినెస్ లోకి అడుగు పెట్టినటువంటి ఈమె పూర్తిగా సినిమాలకు దూరమవుతారా లేకపోతే మంచి అవకాశాలు వస్తే ఇండస్ట్రీలో కూడా కొనసాగుతారా అనే విషయాలు తెలియాల్సి ఉంది.

నితిన్ తన నెక్స్ట్ సినిమాను పాన్ ఇండియా డైరెక్టర్ తో చేస్తున్నాడా..?
Advertisement

తాజా వార్తలు