ఐఐఎఫ్ఎల్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2022 ప్రకారం.భారత సంతతికి చెందిన ఎగ్జిక్యూటివ్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ గతేడాది తన సంపదలో ఐదో వంతును కోల్పోయారు.ఆయన నికర సంపద విలువ 20 శాతం తగ్గి రూ.5,300 కోట్లకు పడిపోయింది.అయనప్పటికీ ఆయన టాప్ టెన్ సంపన్న ప్రొఫెషనల్ మేనేజర్‌లలో ఒకరిగా తన స్థానాన్ని నిలుపుకున్నారు.2018లో సుందర్ పిచాయ్.స్టాక్ ఆప్షన్‌ల గ్రాంట్‌ను తిరస్కరించడం వల్లే సంపదలో హెచ్చుతగ్గులు చోటు చేసుకున్నట్లు నివేదిక తెలిపింది.
ఇకపోతే.పలు యూఎస్ ఆధారిత కంపెనీలకు సీఈవోలుగా వున్న భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ల సంపద కూడా పెరిగిన దాఖలాలు కనిపించడం లేదు.అడోబ్ సీఈవో శంతను నారాయణ్ సంపద 16 శాతం తగ్గి రూ.3,800 కోట్లకు చేరుకుంది.మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల సంపదలో మాత్రం ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.ప్రస్తుతం ఆయన సంపద రూ.6,200 కోట్లుగా వుంది.మాస్టర్ కార్డ్ మాజీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, జనరల్ అట్లాంటిక్ వైస్ ఛైర్మన్ అజయ్ బంగా సంపద విలువ రూ.6,500 కోట్లు.ఆయన కూడా గతేడాది 6 శాతం సంపద కోల్పోయాడు.

ప్రస్తుతం గూగుల్ క్లౌడ్‌కు అధిపతిగా వున్న థామస్ కురియన్ గతేడాది తన సంపదలో 3 శాతం కోల్పోయారు.హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం థామస్ సంపద విలువ రూ.12,100 కోట్లు.ఈ జాబితాలో పేర్కొన్న ప్రొఫెషనల్ మేనేజర్లు వారు పనిచేసిన కంపెనీల స్టాక్ ఆప్షన్ల నుంచి తమ సంపదను సృష్టించుకున్నవారేనని నివేదిక పేర్కొంది.అయితే అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్ , సీఈవో జయశ్రీ ఉల్లాల్ దాదాపు 23 శాతం పెరుగుదలతో.రూ.16,600 కోట్ల నికర సంపదతో భారతీయ సంతతికి చెందిన ప్రొఫెషన్స్ జాబితాలో అత్యంత ధనవంతురాలిగా నిలిచారు.