టీమిండియా యువ క్రికెటర్ సన్ రైజర్స్ హైదరాబాద్ పేసర్ సందీప్ శర్మ వివాహబంధంతో ఓ ఇంటివాడయ్యాడు.తన చిన్ననాటి స్నేహితురాలు తాషా సాత్విక్ ను సందీప్ శర్మ ప్రేమ వివాహం చేసుకున్నాడు.
సందీప్ శర్మ వివాహాన్ని పురస్కరించుకొని సన్ రైజర్స్ యాజమాన్యం సందీప్ శర్మకు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.అతడి భార్య పెళ్లి ఫోటోలు షేర్ చేసిన సన్ రైజర్స్( ఎస్ ఆర్ హెచ్) మిస్టర్ అండ్ మిసెస్ సందీప్ శర్మ ఇద్దరు దాంపత్య జీవితం సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాం అని ట్వీట్ చేసింది.
సందీప్ శర్మ భార్య తాషా సాత్విక్ వృత్తిరీత్యా నగల డిజైనర్ గా పనిచేస్తుంది.కాగా 2018 లోనే వీరి వివాహ నిశ్చితార్థం అయినప్పటికీ కరోనా కారణంగా వివాహం వాయిదా పడింది.
వీరి వివాహ ఫోటోలను సన్ రైజర్స్ టీమ్ అభిమానులకు షేర్ చేసింది.కాగా 2013 నుంచి ఐపీఎల్ లో ఆడుతున్న సందీప్ శర్మ ఇప్పటివరకు 95 మ్యాచ్ లో 110 వికెట్లు తీశాడు.
2018 నుంచి హైదరాబాద్ జట్టు తరఫన ఆడుతున్నాడు.జూలై 17, 2015లో జింబాబ్వే- భారత్ మధ్య జరిగిన టీ-20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు.ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 100 వికెట్లు మైలురాయిని చేరుకున్న ఆరో భారత్ పేసర్ గా సందీప్ వర్మ నిలిచాడు.