ప్లాన్ పూర్తిగా మార్చేసిన సుక్కు.. ఈసారి మరింత హైప్ తో పుష్ప 2!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.350 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుని పుష్ప 2021 లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేసాడు.ఈయన డైరెక్షన్, బన్నీ యాక్టింగ్, మ్యూజిక్ ఇలా అన్నీ ఈ సినిమాను టాప్ లో నిలబెట్టాయి.ఈ సినిమా తో పుష్పరాజ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వైరల్ గా మారింది.

 Sukumar Master Plan For Pushpa 2 , Allu Arjun , Pushpa 2 , Director Sukumar , Pushpa 2 Shooting-TeluguStop.com

ఈ సినిమా ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

పార్ట్ 1 అన్ని కోట్లు కలెక్ట్ చేయడంతో ఇప్పుడు పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు పెరిగాయి.అందుకే సుకుమార్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారట.

 Sukumar Master Plan For Pushpa 2 , Allu Arjun , Pushpa 2 , Director Sukumar , Pushpa 2 Shooting-ప్లాన్ పూర్తిగా మార్చేసిన సుక్కు.. ఈసారి మరింత హైప్ తో పుష్ప 2-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇంటా బయట కూడా దుమ్ములేపిన ఈ సినిమా పార్ట్ 2 కోసం అంతా సిద్ధం చేస్తున్నారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సైతం ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రిపరేషన్ లో ఉన్నాడు అని తెలుస్తుంది.

ఈ సినిమా మొదటి పార్ట్ మంచి లాభాలు రావడంతో రెండవ పార్ట్ ను మరింత ప్రతిష్టాత్మకంగా రూపొందించాలని సుకుమార్ భావిస్తున్నాడట.అందులో భాగంగానే భారీ తారాగణం తో పాటు స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు కూడా చేసి మరింత భారీ స్థాయిలో నిర్మించాలని నిర్ణయించారని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా ఫిబ్రవరి లోనే సెట్స్ మీదకి వెళ్లాల్సి ఉండగా ఈ కారణంగానే ఈ సినిమా ఇంకా మొదలు పెట్టలేదట.

అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.ఈ సినిమా సీక్వెల్ కోసం సుకుమార్ కేటాయించబోయే బడ్జెట్ గురించి ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అయ్యింది.ఈ సీక్వెల్ కు సుకుమార్ ఏకంగా 400 కోట్ల రూపాయల బడ్జెట్ ను కేటాయించ నున్నాడని వస్తున్న వార్తల సారాంశం.

అంతేకాదు పాటల దగ్గర నుండి ఫైట్స్ వరకు అన్ని కూడా గ్రాండ్ గా ఉండేలా సుకుమార్ ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది.మరి ఇంత భారీ లెవల్ లో ప్లాన్ చేస్తున్న సినిమా ఇంకెన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube