రామ్ చరణ్ ఆ సినిమా అంటే సుకుమార్ కి అంత ఇష్టమా... అన్నిసార్లు చూశారా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ప్రస్తుతం పలు సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.

  ప్రస్తుతం ఈయన బుచ్చిబాబు డైరెక్షన్లో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు ఈ సినిమా పూర్తి కాగానే డైరెక్టర్ సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు.

ఇక వీరిద్దరి కాంబినేషన్ లో ఇదివరకే ప్రేక్షకుల ముందుకు వచ్చిన రంగస్థలం (Rangasthalam) సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమా తర్వాత మరోసారి సుకుమార్ డైరెక్షన్లో రాంచరణ్ నటించబోతున్నారనే విషయం తెలియడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.

Sukumar Likes Charan Magadheera And Chirutha Movies , Sukumar, Ram Charan, Chiru

పుష్ప 2 తర్వాత సుకుమార్ రామ్ తో సినిమాకు కమిట్ అయ్యారు.మరోవైపు అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ అట్లీతో సినిమా చేయబోతున్నారు.ఇలా అల్లు అర్జున్ ఈ రెండు సినిమాలు పూర్తి చేసేలోపు సుకుమార్ రామ్ చరణ్ తో సినిమా పూర్తి చేసి తిరిగి వీరిద్దరూ పుష్ప 3 పనులలో బిజీ కాబోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా రాంచరణ్ సుకుమార్ కి సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది.రామ్ చరణ్ తన సినీ కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

Sukumar Likes Charan Magadheera And Chirutha Movies , Sukumar, Ram Charan, Chiru
Advertisement
Sukumar Likes Charan Magadheera And Chirutha Movies , Sukumar, Ram Charan, Chiru

ఇలా రాంచరణ్ నటించిన సినిమాలలో సుకుమార్ కు రెండు సినిమాలంటే చాలా ఇష్టమని ఇప్పటికే ఆ సినిమాలను లెక్కలేనన్ని సార్లు చూసారని తెలుస్తోంది.మరి రాంచరణ్ నటించిన ఏ సినిమాలంటే సుకుమార్ కి ఇష్టం అనే విషయాన్నికి వస్తే ఆ సినిమాలు మరేమో కాదు రామ్ చరణ్ నటించిన చిరుత(Chirutha) అలాగే మగధీర (Maghadheera).ఈ రెండు సినిమాలు సుకుమార్ కి చాలా ఇష్టమట.

రామ్ చరణ్ కెరియర్ మొదట్లోనే ఈ రెండు సినిమాలు చేసినప్పటికీ ఎంతో అనుభవం ఉన్న నటుడిగా ఈ సినిమాలు చేశారని భావించారట.ఈ సినిమాలు చూసిన అనంతరం ఎలాగైనా ఈయనతో సినిమా చేయాలని సుకుమార్ భావించారట.

అలా అప్పుడే రామ్ చరణ్ తో సినిమా చేయాలనుకున్న ఈయన రంగస్థలం సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టారు.

గంజా శంకర్ విషయం లో సంపత్ నంది ఎందుకు అబద్ధాలు చెబుతున్నాడు...
Advertisement

తాజా వార్తలు