లైగర్ సినిమా కోసం యూనిట్ సభ్యులు చేసిన ప్రమోషన్ అంతా ఇంతా కాదు.ఉత్తర భారతం లో దాదాపు నాలుగు అయిదు వారాల ముందు నుండే సినిమా ప్రమోషన్ ను హీరో విజయ్ దేవరకొండ చేయడం మొదలు పెట్టాడు.
అనన్య పాండే తో కలిసి ముంబయి తో పాటు పాటు ఉత్తర భారతం లోని ముఖ్య నగరాలు అన్నింటిని చుట్టేశారు.ఆ సమయంలో లైగర్ కుమ్మేయడం ఖాయం అంటూ గట్టి నమ్మకం ను కలుగజేశారు.
ఇలాంటి సమయంలో లైగర్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని వందల కోట్ల వసూళ్లు నమోదు చేయడం కన్ఫర్మ్ అన్నారు.ఆ మధ్య కేజీఎఫ్ 2 సినిమా తో పాటు బాహుబలి మరియు ఆర్ ఆర్ ఆర్ సినిమా లు కూడా వెయ్యి కోట్ల వసూళ్లు నమోదు చేశాయి.
దాంతో పాన్ ఇండియా స్థాయి లో కుమ్మేయడం ద్వారా లైగర్ సినిమా వెయ్యి కోట్లు సాధిస్తుంది అంటూ కొందరు భావించారు.అభిమానులు భావిస్తే పర్వాలేదు కానీ ఏకంగా పుష్ప దర్శకుడు సుకుమార్ ఒక ఇంటర్వ్యూ లో పూరి జగన్నాథ్ తో మాట్లాడుతూ ఏకంగా మీ సినిమా వెయ్యి కోట్లు రాబట్టడం ఖాయం.
నేను కాస్త తక్కువ చెబుతున్నానేమో కానీ వెయ్యి కోట్లకు పైగానే మీ సినిమా రాబడుతుందని అన్నాడు.ఇప్పుడు సుకుమార్ ఎక్కడ ఉన్నాడో కానీ ఆ వెయ్యి కోట్ల పరిస్థితి ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
మరీ వంద కోట్లు రెండు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు అంటే మరీ విడ్డూరం అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పూరి పై అభిమానం ఉంటే ఉంచుకో కానీ మరీ వెయ్యి కోట్లు అంటూ మాట్లాడటం ఏంటి సుకుమార్ గారు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి సుకుమార్ వెయ్యి కోట్లు ఏమో కానీ కనీసం పాతిక కోట్ల షేర్ ను ఈ సినిమా దక్కించుకోవడం గగనం అయ్యింది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.