కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కి పెద్ద కష్టమే వచ్చి పడింది.టిడిపి నుంచి రాజ్యసభకు ఎన్నికైన సృజన చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ వంటి వారితో కలిసి బీజేపీలో చేరారు.
బిజెపిలో వారు చేరడం వెనుక కారణాలు చాలానే ఉన్నట్టుగా రాజకీయవర్గాల్లో ప్రచారం ఉంది.సుజనా చౌదరి చంద్రబాబు అత్యంత సన్నిహితమైన వ్యక్తిగా గుర్తింపు పొందడంతో పాటు, అనేక బ్యాంకు లావాదేవీల వ్యవహారంలో అనేక కేసులు ఆయనపై ఉన్నాయి.
ఈ నేపథ్యంలోనే వైసిపి ప్రభుత్వ వేధింపుల నుంచి తప్పించుకునేందుకు వారంతా బీజేపీలో చేరారు అనే ప్రచారం ఉంది.ఇది ఇలా ఉంటే… ఈ నెలాఖరు నాటికి సుజనా చౌదరి తో పాటు, టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనుంది.
దీంతో ఆయన బిజెపి లోనే కొనసాగుతారా లేక టిడిపిలో చేరుతారనే విషయంలో అందరికీ ఆశక్తి కలుగుతోంది.బిజెపి నుంచి టీడీపీలో చేరితే లాభం కంటే నష్టమే ఎక్కువగా సుజనా చౌదరికి ఉందట.
ఆయన పైన, ఆయన కంపెనీలపైన నమోదైన కేసులు, అనేక బ్యాంకులకు డీ ఫాల్డర్ గా ఆయన, ఆయన కంపెనీల పైన నమోదయిన కేసులు.ఇవన్నీ ప్రస్తుతం పెండింగ్ లో ఉన్నాయి.
ఒకవేళ సుజనా చౌదరి పార్టీ మారితే, బిజెపి వాటిని తెరపైకి తెచ్చే అవకాశం లేకపోలేదు.అంతే కాకుండా , ఇప్పుడు బిజెపి నుంచి టిడిపిలో చేరినా, అక్కడ పెద్దగా అవకాశాలు ఏవి ఉండవు.
రాజకీయంగాను అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాగే కేంద్రంలో మరోసారి బిజెపి అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వెలువడటంతో, టీడీపీ కంటే బీజేపీలో ఉండడమే మంచిదనే ఆలోచనలో ఉన్నారట.ప్రస్తుతానికి ఆయన బిజెపిలో కొనసాగుతున్నా, మనసులో మాత్రం టిడిపిలోకి వెళ్లాలనే ఆలోచన బలంగా ఉండదట.అందుకే బిజెపిలో ఉండలేక టిడిపిలోకి వెళ్లలేక సుజన సతమతమవుతున్నారట.
మరికొద్ది రోజుల్లోనే ఆయన పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన వ్యవహారం పై సరైన క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.







