ఖమ్మం జిల్లా: వైరా నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గ సంఘం ఆధ్వర్యంలో నిర్మిస్తున్న కమ్మ వారి కళ్యాణ మండపం నిర్మాణం కొరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన సోదరుడు పువ్వాడ ఉదయ్ కుమార్ జ్ఞాపకార్థం ఐదు లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు.దానిలో భాగంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాతృమూర్తి విజయలక్ష్మి, పువ్వాడ ఉదయ్ కుమార్ సతీమణి జయశ్రీ ల చేతులమీదుగా ఐదు లక్షల రూపాయల నగదును కమ్మ మహాజన సంఘం ప్రతినిధులకు అందజేశారు.
ఈ సందర్బంగా మంత్రి పువ్వాడకు, వారి కుటుంబ సభ్యులకు కమ్మ మహాజన సంఘం ప్రతినిధులు కృతఙ్ఞతలు తెలిపారు.







