మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ సుజనా చౌదరి చెన్నైలోని ఆర్థిక నేరాల విభాగం కోర్టుకు హాజరైయ్యారు.రూ.363 కోట్ల బ్యాంక్ బకాయిల వివాదం నేపథ్యంలో మనీలాండరింగ్ చట్టం కింద న్యాయస్థానం సుజనా చౌదరికి నోటీసులు జారీ చేసింది.అదేవిధంగా సుజానాకు చెందిన బీసీఈపీఎఎల్ డైరక్టర్లకు నోటీసులిచ్చింది.
మూడు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదని ఆరోపణలపై విచారణ చేపట్టిన ఈడీ.ఎంపీ సుజనా చౌదరి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు తేల్చింది.సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.133 కోట్లు, ఆంధ్రా బ్యాంకు నుంచి రూ.71 కోట్లు, కార్పొరేషన్ బ్యాంకు నుంచి రూ.159 కోట్ల మేర రుణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.







