దోస పంట సాగులో బోరాన్ లోపం నివారణ కోసం సూచనలు..!

ఏడాది పొడవున సాగు చేసే పంటలలో దోస పంట ( Cucumber crop )కూడా ఒకటి.

తెలుగు రాష్ట్రాలలో అధిక తీర్ణంలో సాగుతున్న తీగజాతి పంటలలో కూర దోస మంచి ప్రాచుర్యం పొందిన పంట.

అయితే ఈ పంటలో బోరాన్( Boron ) లోపం వల్ల తీవ్ర నష్టం వాటిల్లుతుంది.కాబట్టి దోస పంట సాగులో బోరాన్ లోపం గుర్తించి సరైన యాజమాన్య పద్ధతులు పాటించి అధిక దిగుబడులు పొందవచ్చు.

పంట పూత, పిందే దశలలో ఉన్నప్పుడు పంటకు బోరాన్ లోపం సంభవించే అవకాశాలు ఉన్నాయి.రైతులు సరైన అవగాహన లేక కేవలం రసాయన ఎరువులు మాత్రమే పంటకు అందిస్తూ, సూక్ష్మ పోషకాలను నిర్లక్ష్యం చేయడం వల్ల పోషకాల లోపం ఏర్పడుతుంది.

ముఖ్యంగా బోరాన్ లోపం ఏర్పడి పంట నాణ్యత తగ్గడంతో పాటు, కాయలు కూడా పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి.పంట వేసిన తరువాత మొక్క నాలుగు లేదా ఐదు ఆకుల దశలో ఉన్నప్పుడు బోరాన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.ఈ సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలి.

Advertisement

ఎకరం నేలలో రెండున్నర కిలోల యూరియా, రెండు కిలోల పొటాష్ ఎరువులను ( Potash fertilizers )45 రోజుల వ్యవధిలో 15 విడతలుగా పంటకు అందించాలి.తరువాత రెండు కిలోల యూరియా, మూడు కిలోల పొటాష్ ఎరువులు నీటిలో కలిపి డ్రిప్ పద్ధతి ద్వారా పంటకు అందిస్తే, పంటకు కావలసిన సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అంది బోరాన్ లోప సమస్యలు ఏర్పడవు.తరువాత పూత, పిందే దశలలో లీటరు నీటిలో 0.5 మిల్లీలీటర్ల స్కోర్ ను కలిపి రెండు లేదా మూడుసార్లు పిచికారి చేయాలి.దీంతో కాయ నాణ్యత మెరుగవడంతో పాటు సూక్ష్మ పోషకాల కొరత ఏర్పడదు.

తద్వారా ఆశించిన స్థాయిలో దిగుబడి పొందవచ్చు.రైతులకు అవగాహన లేకపోతే కచ్చితంగా వ్యవసాయ నిపుణుల సలహాలు పాటించి పంటను సంరక్షించుకోవాలి.

Advertisement

తాజా వార్తలు