బుల్లితెర కింగ్ సుడిగాలి సుధీర్.. ప్రూఫ్ ఇదిగో

బుల్లితెరలో సుడిగాలి సుధీర్ రేంజ్ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టాలీవుడ్ స్టార్ హీరోలకున్నంత ఫాలోయింగ్ సుడిగాలి సుధీర్ కు ఉంది.

అతి తక్కువ సమయంలో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్నాడు.సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు.

ఇక ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన పాన్ ఫాలోయింగ్ ఉంది.ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెర కింగ్ గా కూడా నిలిచాడు.

కెరీర్ మొదట్లో మ్యాజిక్ చేస్తూ ఉండే సుధీర్ కు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షోలో అవకాశం రావడంతో ఇక్కడే సెటిల్ అయిపోయాడు.నిజానికి జబర్దస్త్ లో తన కామెడీ టైమింగ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ కమెడియన్ గా నిలిచాడు.

Advertisement

ఇందులోనే ఉండగానే వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు.హీరోగా కూడా నటించి మంచి సక్సెస్ లు అందుకున్నాడు.

ఇక కేవలం జబర్దస్త్ లోనే కాకుండా పోవే పోరా అనే షోలో యాంకరింగ్ చేసి యువతను ఆకట్టుకున్నాడు.ఇక ప్రస్తుతం ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ డాన్స్ షోలో కూడా టీం లీడర్ గా పని చేస్తున్నాడు.ఇక ఈ షోతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కూడా యాంకర్ గా చేస్తున్నాడు.

ఇలా వరుసగా షో లలో బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా తన సమయాన్ని గడుపుతాడు.

ఇదిలా ఉంటే తాజాగా బుల్లితెరలో ప్రసారమౌతున్న షోలలో యాంకర్లకు, జడ్జిలకు సోషల్ మీడియాలో తమకు ఉన్న ఫాలోయింగ్ బట్టి ఓ సర్వేను చేశారు.అందులో ఐదుగురిని సెలెక్ట్ చేయగా టాప్ ప్లేస్ లో సుడిగాలి సుధీర్ నిలిచాడు.ఆ తర్వాత హైపర్ ఆది, ఓంకార్, సుమ, నాగబాబు ఉండగా ఎన్నో ఏళ్ళనుండి ఉంటున్న వీరికంటే అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్.

హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!
Advertisement

తాజా వార్తలు