సుడిగాలి సుధీర్‌ మళ్లీ ఈటీవీలో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడా?

ఒక చిన్న మ్యూజీషియన్‌ గా కెరీర్‌ ను మొదలు పెట్టి ఎన్నో ఇబ్బందులు పడ్డ సుధీర్( Sudheer ) ఈటీవీలో ప్రసారం అయిన జబర్దస్త్‌ కార్యక్రమంలో ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే సుడిగాలి సుధీర్‌ అంటూ ఒక టీమ్ లీడర్ గా నిలిచాడు.

దాదాపు దశాబ్ద కాలం పాటు ఈటీవీలో సుధీర్ సందడి కొనసాగింది.

కొన్ని కారణాల వల్ల మొదట శ్రీదేవి డ్రామా కంపెనీ( Sridevi Drama Company ) నుండి తప్పుకున్న సుడిగాలి సుధీర్‌ ఆ తర్వాత ఈటీవీ మొత్తం నుండి కూడా తప్పుకోవడం జరిగింది.దాంతో సుడిగాలి సుధీర్ కనిపించకుండా పోయాడు అంటూ అభిప్రాయం వ్యక్తం అయింది.

సోషల్‌ మీడియాలో సుడిగాలి సుధీర్ గురించి రకరకాలుగా పుకార్లు చేయడం మొదలు అయింది.

సినిమాల కోసం సుధీర్ ఈటీవీని వదిలేస్తే ఆ సినిమాలు రావడం లేదు.కూర్చుని ఉన్న మొక్కను నరుక్కుని చాలా పెద్ద తప్పు చేశాడు అంటూ చాలా మంది కూడా విమర్శలు గుప్పించారు.తాజాగా సుడిగాలి సుధీర్ గురించి ఆసక్తికర పుకారు ఒకటి షికారు చేస్తోంది.

Advertisement

ఈటీవీలో( Etv ) కనిపించకుంటే అసలు కనిపించకుండా ఉంటున్న సుడిగాలి సుధీర్ ను మళ్లీ ఈటీవీ ఆహ్వానించింది అంటున్నారు.మల్లెమాల వారు సుధీర్ రీ ఎంట్రీ కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు అంటున్నారు.

తాజాగా ఈటీవీ బలగం( Balagam Show ) అనే షో లో సుధీర్ సందడి చేశాడు.ఆ షో లో మళ్లీ సుధీర్ కి మరియు రష్మికి లవ్‌ సింబల్ వేయడం జరిగింది.

ఆ ప్రోమో కి మంచి ఆధరణ లభించింది.వీరిద్దరు మళ్లీ కలిస్తే తప్పకుండా ఈటీవీ తో పాటు అందరికి కూడా లాభం అన్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది.సుధీర్ కూడా ఈటీవీ లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నాడు.

సుడిగాలి సుధీర్‌ సోషల్‌ మీడియా లో కూడా ఈ మధ్య కనిపించడం లేదు.కనుక జబర్దస్త్‌ లో( Jabardasth ) రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

చలాకీ చంటి కి జబర్దస్త్‌ లో రీ ఎంట్రీ దక్కింది.కనుక సుధీర్‌ కి కూడా రీ ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.

Advertisement

ఇటీవలే కొత్త సినిమా ని సుడిగాలి సుధీర్ మొదలు పెట్టాడు.ఆ సినిమా తో పాటు ఈటీవీ లో కూడా ఛాన్స్ దక్కించుకుంటాడేమో చూడాలి.

తాజా వార్తలు