Sudheer Gaalodu Movie Review: గాలోడు రివ్యూ: వన్ మెన్ షోగా కనిపించిన గాలోడు!

డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి పులి చర్ల దర్శకత్వంలో రూపొందిన సినిమా గాలోడు.ఇందులో బుల్లితెర స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా నటించాడు.

ఈయన సరసన గెహ్నా సిప్పీ హీరోయిన్ గా నటించింది.అంతేకాకుండా సప్తగిరి, షకలక శంకర్, పృథ్వీ, సత్య కృష్ణన్ తదితరులు నటించారు.

ఇక ఈ సినిమాను సంస్కృతి ఫిలిమ్స్ బ్యానర్ పై డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్ రెడ్డి పులిచర్ల నిర్మాతగా కూడా బాధ్యతలు చేపట్టాడు.భీమ్స్ సిసి రోలియో ఈ సినిమాకు సంగీతం అందించగా.

సి.రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ అందించాడు.ఇక ఈ సినిమా గురించి ప్రకటించినప్పటి నుంచి సుధీర్ అభిమానులు మాత్రం ఈ సినిమా గురించి తెగ ఎదురు చూశారు.

Advertisement

ఇప్పటికే బుల్లితెరపై స్టార్ గా పేరు సంపాదించుకున్న సుధీర్ కు వెండితెరపై కూడా మంచి గుర్తింపు రావాలి అని ఆయన అభిమానులతో తను కూడా ఆశ పడుతున్నారు.ఇక ఈ సినిమా ఈరోజు థియేటర్లో రాగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.

అంతేకాకుండా సుధీర్ కి ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.

కథ:

ఇందులో సుధీర్ రజనీకాంత్ పాత్రలో కనిపిస్తాడు.ఇక రజినీకాంత్ పల్లెటూరిలో గాలికి తిరిగే కుర్రాడు అని చెప్పవచ్చు.

అయితే ఓసారి పేకాట ఆడుతుండగా ఆటలో భాగంగా అనుకోకుండా గొడవ రావటంతో రజినీకాంత్ ఆ ఊరి సర్పంచ్ కొడుకుని కొడతాడు.దీంతో అతను అక్కడికక్కడే చనిపోగా వెంటనే రజినీకాంత్ ఆ కేసు తనపై పడుతుంది అని తప్పించుకునేందుకు సిటీకి పారిపోతాడు.

ఆ సమయంలో అతనికి శుక్లా (గెహ్నా సిప్పీ) ఎదురవుతుంది.ఆ తర్వాత వారి మధ్య పరిచయం పెరిగి ప్రేమగా మారుతుంది.ఇక ఆ తర్వాత రజనీకాంత్ జీవితంలో ఎదుర్కొనే సంఘటనలు.

విజయవాడలో బిజినెస్ అండ్ టూరిజం వీసాపై సదస్సు
హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?

చివరికి అతడు ఆ కేసుల నుంచి ఎలా బయటపడతాడు.అతని జీవితంలోకి వచ్చిన శుక్లా ఎవరు.

Advertisement

చివరికి ఏం జరుగుతుంది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:

సుధీర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ సినిమాలు యాక్షన్ పాత్రలో అదరగొట్టాడు.రొమాన్స్ లో కూడా బాగా మెప్పించాడు.

హీరోయిన్ గెహ్నా కూడా బాగా నటించింది.మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:

టెక్నికల్ పరంగా డైరెక్టర్ ఈ సినిమాకు రొటీన్ కథను అందించాడు.ఇక సినిమాటోగ్రఫీ పరవాలేదు.

సంగీతం బాగానే ఆకట్టుకుంది.మిగిలిన నిర్మాణ విలువలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.

విశ్లేషణ:

మంచి మాస్ కంటెంట్తో డైరెక్టర్ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.ఇక ఈ సినిమా రొటీన్ గా అనిపించిన కూడా మధ్య మధ్యలో వచ్చే ట్విస్టులు లతో కథ ఆసక్తిగా ఉంటుంది.

ఇక సుధీర్ పాత్ర మాత్రం ఈ సినిమాలో వన్ మెన్ షోలా కనిపించింది.

ప్లస్ పాయింట్స్:

నటీనటుల నటన, క్లైమాక్స్, డైలాగ్స్, మ్యూజిక్.

మైనస్ పాయింట్స్:

రొటీన్ లవ్ స్టోరీ, ఫస్టాఫ్.

బాటమ్ లైన్:

చివరగా చెప్పాల్సిందేంటంటే రొటీన్ స్టోరీ అయినా సుధీర్ కోసం సినిమా చూడాల్సిందే అని చెప్పవచ్చు.

రేటింగ్: 3/5

" autoplay>

తాజా వార్తలు