హీరో అయినా కమెడియన్ అనే పిలుస్తున్నారు.. సుధీర్ కామెంట్స్ వైరల్?

సుడిగాలి సుదీర్( Sudheer ) ప్రస్తుతం వెండితెర సినిమాలలో నటిస్తే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇటీవల గాలోడు ( Galodu ) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకోగా తర్వాత కాలింగ్ సహస్ర( Calling Sahastra ) ఆనే సినిమా ద్వారా డిసెంబర్ ఒకటవ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

అయితే ఈ సినిమా పూర్తిగా నిర్మాతలకు నష్టాలను మిగిల్చిందని చెప్పాలి.అసలు లాజిక్ లేనటువంటి సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఇక ఈ సినిమా పూర్తిగా నెగిటివ్ రివ్యూలతో డిజాస్టర్ టాక్ సొంతం చేసుకొని నిర్మాతలకు భారీ నష్టాలను తీసుకువచ్చింది.అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి సుధీర్ ఈ సినిమా గురించి ఎన్నో విషయాలను తెలియజేశారు.నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నేను నటిస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారు అన్న ఉద్దేశంతోనే తాను ఈ సినిమా చేశానని సినిమా చూసిన వాళ్ళు నా నటనపై ప్రశంసలు కురిపించారని సుధీర్ తెలిపారు.

ఈ సమావేశంలో భాగంగా ఈయనకు విలేకరి నుంచి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.మీరు హీరో అయినప్పటికీ కొంతమంది మిమ్మల్ని జబర్దస్త్ కమెడియన్ ( Jabardasth Comedian ) అనే పిలుస్తున్నారు.

Advertisement

మీపై ఆ ట్యాగ్ ఇంకా తొలగిపోలేదు దీనికి మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు సుదీర్ సమాధానం చెబుతూ నేను హీరో అయిన జబర్దస్త్ కమెడియన్ అంటూ ఉంటే నేను ఏమాత్రం ఫీల్ అవ్వలేదని ఎందుకంటే నాకు ఈ లైఫ్ ఇచ్చినదే జబర్దస్త్ కార్యక్రమం అని నేను అక్కడి నుంచే నా కెరియర్ మొదలు పెట్టాను కనుక ఆ విషయంలో తాను ఏమాత్రం ఫీల్ అవ్వడం లేదు అంటూ ఈ విషయంపై సుధీర్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక కాలింగ్ సహస్ర సినిమా అభిమానులను పూర్తిగా నిరాశపరచడంతో సుధీర్ తదుపరి ఎలాంటి సినిమాల ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు