కృష్ణ అల్లుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు (Sudheer Babu) హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం మామ మశ్చీంద్ర (Mama Mascheendra).హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు ఈ సినిమాలో ఏకంగా మూడు పాత్రలలో నటించారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా ఈషా రెబ్బా, మృణాళిని రవి, హర్షవర్ధన్, ‘మిర్చి’ కిరణ్, అజయ్, రాజీవ్ కనకాల, హరితేజ, ‘షకలక’ శంకర్, అలీ రేజా తదితరులు ఈ సినిమాలో భాగమయ్యారు.ఇక నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా ఎలాంటి కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే…
కథ:
పరశురామ్ (సుధీర్ బాబు) బాల్యంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా రాతి మనిషిలా మారడతాడు.వందల కోట్ల ఆస్తి కోసం సొంత మనుషులను సైతం చంపడానికి వెనుకాడడు.
చెల్లెలు తన భర్త పిల్లలని చంపమని తన మనుషులను పంపిస్తారు.ఇలా ఈ దాడి నుంచి వారు తప్పించుకుంటారు.
కొద్ది రోజుల తర్వాత పరశురామ్ కుమార్తె విశాలాక్షి (ఈషా రెబ్బా),( Eesha Rebba ) విశాఖలో రౌడీ దుర్గ (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు.ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చిన దాసు కుమార్తె మీనాక్షి (మృణాళిని రవి),( Mrinalini Ravi ) ఫేమస్ డీజే (సుధీర్ బాబు) ప్రేమలో పడతారు.
ఈ విషయం తెలిసి… తన పోలికలతో జన్మించిన మేనల్లుళ్లు పగ తీర్చుకోవాలని అనుకుంటారు.ఇక పరుశురాం మీద హత్యాయత్నం చేసినది ఎవరు? వీరిద్దరూ తమ కుమార్తెల వద్ద దాచిన నిజం ఏంటి అన్నదే ఈ సినిమా కథ.

నటీనటుల నటన:
ఇందులో సుధీర్ బాబు మూడు విభిన్న పాత్రలలో నటించారు అయితే ఈయనకు నార్మల్ క్యారెక్టర్ కాకుండా మిగతా రెండు క్యారెక్టర్లు ఏమాత్రం సెట్ కాలేదని చెప్పాలి.ఇక డబ్బింగ్ కూడా ఇతరులతో చెప్పించడం వల్ల ప్రేక్షకులు ఆ పాత్రను ఎంజాయ్ చేయలేకపోయారని చెప్పాలి. ఈషా రెబ్బా, మృణాళిని రవి… హీరోయిన్లు ఇద్దరి పాత్రలు రొటీన్! ఆయా పాత్రల్లో వాళ్ళ నటన కూడా! దర్శక, రచయితగా కంటే నటుడిగా హర్షవర్ధన్ బాగా నటించారు ఇక రాజీవ్ కనకాల,( Rajiv Kanakala ) షకలక శంకర్,( Shakalaka Shankar ) అలీ రేజా ( Ali Reza ) వంటి వారు వారి పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్:
డైరెక్టర్ హర్షవర్ధన్( Harshavardhan ) సుదీర్ బాబుని ఏకంగా మూడు పాత్రలలో చూపించేసరికి ప్రేక్షకులు కాస్త గందరగోళానికి గురయ్యారు అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఇక మ్యూజిక్( Music ) కూడా ఈ సినిమాకు పెద్దగా లేదని చెప్పాలి, ఇక సుధీర్ బాబుకు మేకప్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.నిర్మాణ విలువలు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి.
విశ్లేషణ:
రచయితగా హర్షవర్ధన్ ఎన్నో అద్భుతమైన సినిమాలకు కథ రాశారు కానీ దర్శకుడుగా మెప్పించలేకపోయారు.అయితే ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు కన్ఫ్యూజన్ కి గురయ్యారు.ఇక ఈ సినిమా చూడగానే మొదట్లోనే అలా వైకుంఠపురం సినిమా గుర్తుకు వస్తుంది.కొన్నిచోట్ల ట్విస్టులను సాగదీస్తూ వచ్చారు.

ప్లస్ పాయింట్స్:
అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.హీరోయిన్స్ నటన పరవాలేదు అనిపించింది.
మైనస్ పాయింట్స్:
సుధీర్ బాబు మూడు పాత్రలలో నటించడం, కథ గందరగోళం, మ్యూజిక్.
బాటమ్ లైన్:
కథలో కంటెంట్ లేకపోయినా ఏదో సినిమాని సాగదీస్తూ వచ్చారు.ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు గందరగోళానికి గురయ్యారని చెప్పాలి.







