మాస్ మహారాజ రవితేజ ( Ravi Teja )వాల్తేరు వీరయ్య, ధమాకా వంటి వరుస బ్లాక్ బస్టర్స్ అందుకుని మరింత ఉత్సాహంగా ముందుకు వెళుతున్న నేపథ్యంలో ఈయన సినిమాలపై క్రేజ్ కూడా ఇదే రేంజ్ లో పెరిగి పోతుంది.ప్రస్తుతం రవితేజ మరో సినిమాతో దసరా బరిలో నిలవబోతున్నాడు.
”టైగర్ నాగేశ్వరరావు” ( Tiger Nageswara Rao )అనే పాన్ ఇండియన్ సినిమాతో దసరా బరిలో నిలవబోతున్నాడు.

ఈ సీజన్ లో భారీ పోటీ ఉన్నపటికీ వెనకడుగు వేయడం లేదు.ఈ సినిమాపై టీమ్ అంతా ధీమాగా ఉంది.బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయం అంటూ ముందు నుండి ఈ సినిమా విషయంలో నిర్మాత సైతం కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
నూతన డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో రవితేజ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారడానికి సిద్ధం అవుతున్నాడు…
ఈ సినిమా నుండి రెండు రోజుల క్రితం ట్రైలర్ ( Trailer )ను చూపించేసారు.ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
ఇక తాజాగా మేకర్స్ మరో అప్డేట్ ఇచ్చారు.రిలీజ్ విషయంలో మేకర్స్ తీసుకున్న నిర్ణయం గ్రేట్ అంటూ అంతా పొగుడుతున్నారు.
ఈ సినిమాను సైన్ లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా మేకర్స్ అనౌన్స్ చేశారు.సైన్ లాంగ్వేజ్ అంటే కేవలం సైగలతో మాత్రమే కమ్యూనికేట్ చేయడానికి వాడే భాష….

దీనిని చెవిటి, మూగ ఉన్నవారు కమ్యూనికేట్ చేసుకోవడానికి వాడుకునే భాష.మరి అలాంటి వారికీ కూడా సినిమా అర్ధం అయ్యేలా మొదటిసారి సైన్ లాంగ్వేజ్ లో సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు చెప్పడంతో అంతా గ్రేట్ అంటూ ప్రశంసలు అందిస్తున్నారు.ఇక ఈ సినిమాలో నుపుర్ సనన్( Nupur Sanon ), గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకు జివి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తుండగా అక్టోబర్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.
ఇక అనుపమ్ ఖేర్, రేణు దేశాయ్, జిషు సేన్ గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు.







