పవన్ కోసం మరో స్టార్ యాక్టర్.. ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తూ దూకుడును ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే.

ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘వకీల్ సాబ్’ చివరిదశ షూటింగ్‌ను జరుపుకోవాల్సి ఉండగా, తన నెక్ట్స్ చిత్రాలను ఇప్పటికే ఓకే చేస్తూ పవన్ అందరినీ అవాక్కయ్యేలా చేస్తున్నాడు.

ఈ క్రమంలో దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో ఓ సినిమా, దర్శకుడు హరీష్ శంకర్ డైరెక్షన్‌లో ఓ సినిమా చేసేందుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసినా ఇంకా షూటింగ్ మాత్రం మొదలుపెట్టలేదు.

ఇక ఈ తరుణంలో మరో సినిమాకు పవన్ పచ్చ జెండా ఊపేశాడు.మలయాళంలో సూపర్ హిట్ మూవీగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కొషియుమ్’ అనే సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ రెడీ అయ్యింది.

ఈ సినిమాలో హీరోగా పవన్ కళ్యాణ్ నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల అనౌన్స్ కూడా చేసింది.అయితే ఈ సినిమాలో మరో ముఖ్య పాత్రలో నటించేందుకు తొలుత రానాను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావించింది.

Advertisement

కానీ ఆ పాత్రలో ఎవరు నటిస్తున్నారనే విషయంపై ఇంకా చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.దీంతో తాజాగా ఈ సినిమాలో పవన్‌తో పాటు మరో స్టార్ యాక్టర్‌ను తీసుకునేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.

కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చ సుదీప్‌ను ఈ సినిమాలో తీసుకుంటే సినిమాకు మంచి క్రేజ్ దక్కుతుందని భావించిన చిత్ర యూనిట్ ఆ దశగా అడుగులు వేస్తోంది.సుదీప్‌ను ఈ సినిమాలో ఎలాగైనా నటించేందుకు ఒప్పించేలా చిత్ర యూనిట్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో పవన్ మరోసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తుండగా సూర్యదేవర నాగవంశీ ప్రొడ్యూస్ చేయనున్నాడు.

వీడియో వైరల్ : మూఢనమ్మకంతో చనిపోయిన వ్యక్తిని నీటిలో వేలాడదీసిన గ్రామ ప్రజలు.. చివరకు..?!
Advertisement

తాజా వార్తలు