తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( Revanth Reddy ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాలేజీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ కష్టపడితే విజయం మీ సొంతమని స్పష్టం చేశారు.చదువులో ఒక నిర్దిష్టమైన గమ్యాన్ని పెట్టుకుని కష్టపడి చదివితే తప్పకుండా సాధిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు.
తన కుటుంబంలో తనకంటే ముందు రాజకీయాలలో ఎవరూ లేరని చెప్పుకొచ్చారు.ఈ క్రమంలో ముందుగా జడ్పిటిసిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినట్లు తెలిపారు.
ఆ తర్వాత శాసనమండలిలో ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఇంకా ఎంపీగా ఇప్పుడు ప్రజల దయవల్ల ముఖ్యమంత్రిగా మీ ముందు నిలబడ్డాను అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.ప్రజా ప్రతినిధులు ఎన్నిక కాబడే అన్ని వేదికలలో పనిచేసిన అనుభవం ఉంది.
ఈ రోజు నేను మాత్రమే కాదు మా మంత్రులు మరియు ఎమ్మెల్యేలు 18 గంటలపాటు కష్టపడి పనిచేస్తున్నారు.దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందు ఉండే విధంగా.
తమ ప్రభుత్వం కష్టపడి పని చేస్తుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.అదేవిధంగా విద్యార్థులు రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు.
ఈ క్రమంలో ప్రజలలోకి వెళ్లి వాళ్ళ సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా వ్యవహరించాలని సూచించారు.ఈ దేశం మన అందరిదీ కాబట్టి విద్యార్థులు రాజకీయాల్లోకి రావడం మంచిదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.