ఎన్నికల్లో ఏదైనా రాజకీయ పార్టీ గట్టెక్కాలంటే అన్ని వర్గాల మద్దతు తప్పనిసరి.అందుకే రాజకీయా పార్టీలు ఏవేవో హామీలు ఇస్తూ యువతను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటాయి.
పార్టీల గెలుపులో కీలక భాగం అయిన యువ ఓటర్ల మద్దతు పార్టీలకు చాలా అవసరం.వారు గెలుపోటములను ప్రభావితం చేయగలరు.
యువతను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి.ఇప్పటికే అధికార పార్టీ అధికార పార్టీ నిరుద్యోగ బృతి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విస్త్రతంగా ప్రచారం చేస్తోంది.
ఇక జనసేన విషయానికి వస్తే మెజార్టీ సంఖ్యలో యువత అంతా ఆయన చుట్టూనే తిరుగుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ రేసులో వెనకబడకుండా యువత మద్దతు కూడగట్టేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది.

అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి నవంబర్ 17వ తేదీ వరకూ విడతల వారీగా విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై పోరాట కార్యక్రమాలు ప్లాన్ చేశారు.అక్టోబర్ రెండు, మూడు తేదీల్లో నిరుద్యోగ భృతి, ఉద్యోగాల నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో 48 గంటల దీక్షలకు దిగేందుకు సిద్ధం అవుతున్నారు.ఎన్నికలకు ఆరు నెలల ముందు నిరుద్యోగ భృతి ఇస్తామంటూ యువతను చంద్రబాబు తప్పుదారి పట్టిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.కేవలం 20వేల ఉద్యోగాలు భర్తీకి జీవో విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు తీరును నిరసిస్తూ ఈ కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది.

బాబు పాలనలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం.పూర్తిగా నిర్వీర్యం అయ్యిందని అక్టోబర్ 25నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టబోతున్నారు.అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రభుత్వ హాస్టల్‌లోని విద్యార్థుల సమస్యపై హాస్టల్ నిద్ర కార్యక్రమాని చేపట్టనున్నారు.నవంబర్ 5 నుంచి 15 తేది వరకూ విద్యార్ధి, యువజన విభాగాల మెంబర్ షిప్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఇక నవంబర్ 17 తేదిన ఇంటర్ నేషనల్ స్టూడెంట్ డే సందర్భంగా.అమ్మవడి, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలను వివరిస్తూ కళాశాలల్లో సమావేశాలు ఏర్పాటు చేసి అందులో జగన్ పాల్గొనేలా ప్లాన్ చేస్తున్నారు.
అంతే కాకుండా గత ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీల అమలు చేయలేదంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరంతరం నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.