కెనడాలోని ( Canada )ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన బ్రాంప్టన్‌లోని అల్గోమా యూనివర్సిటీలో భారతీయ విద్యార్ధులు ఆందోళనకు దిగారు.వీరంతా పంజాబ్‌కు చెందిన వారే కావడం గమనార్హం.
ఐటీ గ్రాడ్యుయేషన్ కోర్స్ నిర్దిష్ట సబ్జెక్ట్‌లో 130 మంది విద్యార్ధులు సామూహికంగా ఫెయిల్ కావడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు.తాము 9 సబ్జెక్ట్‌ల్లో ఉత్తీర్ణులయ్యామని.
కానీ ‘‘టెక్నిక్స్ ఆఫ్ సిస్టమ్ అనలిస్ట్ ’’( Techniques of System Analyst ) ప్రాక్టీకల్ పరీక్షలో అదే సబ్జెక్ట్‌కు సంబంధించి థియరీ పేపర్‌లో ఉద్దేశపూర్వకంగా తమను ఫెయిల్ చేశారని భారతీయ విద్యార్ధులు వాదిస్తున్నారు.

పంజాబ్‌కు చెందిన కరణ్‌బీర్ సింగ్ ( Karanbir Singh )అనే విద్యార్ధి ఈ ఘటనపై మాట్లాడుతూ.130 మంది విద్యార్ధులు ఒకే సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడం ఆశ్చర్యంగా వుందన్నారు.ఈ సబ్జెక్ట్‌లో ఫెయిల్యూర్ శాతం ఎక్కువగా వుందని, కొందరు నిరసన తెలిపిన విద్యార్ధులు సబ్జెక్ట్‌లో ఫెయిల్ అయిన తర్వాత మళ్లీ ఈ కోర్సును చదువుతున్నారని కరణ్‌బీర్ చెప్పారు.
మరో ప్రొఫెసర్‌తో పేపర్‌లను తిరిగి మూల్యంకనం చేయడానికి విశ్వవిద్యాలయం అంగీకరించే వరకు తాము నిరసన తెలుపుతామని ఆయన వెల్లడించారు.

ఇంతలో విద్యార్ధుల నిరసనకు క్యాంపస్ వెలుపల భారీ మద్ధతు లభించింది.మాంట్రియల్ యూత్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్( Montreal Youth Students Organization ), ఇతర సంస్థలు విద్యార్ధులకు అండగా నిలిచాయి.ఈ ప్రత్యేక సబ్జెక్ట్ ప్రొఫెసర్ తీరుపై విశ్వవిద్యాలయం జోక్యం చేసుకుని విచారణ నిర్వహించాలన్నది వారందరి సమిష్టి డిమాండ్.
ఈ ఆరోపణలపై అల్గోమా విశ్వవిద్యాలయం ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.తాము గ్రేడ్‌లకు సంబంధించి ప్రతి విద్యార్ధితో మాట్లాడతామని, వారి ఆందోళలను తీవ్రంగా పరిగణిస్తామని చెప్పారు.
సైన్స్ డీన్ అత్యవసర విచారణకు నాయకత్వం వహిస్తున్నారని యూనివర్సిటీ తెలిపింది.విద్యార్ధులపై వున్న ఒత్తిడిని తాము గుర్తించామని, అకడమిక్ సమగ్రతకు విలువనిస్తామని, ప్రతి విద్యార్ధికి న్యాయమైన మూల్యంకనం జరగడానికి సైన్స్ ఫ్యాకల్టీ జోక్యం చేసుకుంటుందని యూనివర్సిటీ వెల్లడించింది.