నిన్న ఒకరు ఆన్లైన్ క్లాసుల కోసం సెల్ కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకుంటే ఈరోజు ఆన్లైన్ క్లాసులు అర్ధం కాక ఓ ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.ఎన్నో సార్లు క్లాసులు వినేందుకు ప్రయత్నించినా పాఠాలు అర్ధం అవ్వడం లేదని, భవిష్యత్తులో న్యాయవాదిగా స్థిరపడాలంటే లక్ష్యం నెరవేరదు అనే భయంతో ఆ కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో రాశాడు.
అంతేకాదు ఆన్‌లైన్ క్లాసుల విధానంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంకు సూచించాడు.ఇంకా ఈ ఘటన సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలో చోటుచేసుకుంది.కంసాలి బజార్ లో నివసిస్తున్న అశోక్ కుమార్ పెద్ద కుమారుడు మారేడ్‌పల్లిలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ రెండొవ సంవత్సరం చదువుతున్నాడు.
అతనికి లాయర్ అవ్వడం జీవితాలక్ష్యం అని, అందుకే ఇంటర్ లోను హెచ్‌ఈసీ గ్రూప్‌ను ఎంచుకొని బాగా చదివేవాడు అని, ఇంతలోనే కరోనా కారణంగా గత నాలుగు రోజులుగా ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో ఆ క్లాసులు అర్ధం కావడం లేదని తల్లిదండ్రులకు చెప్పి బాదపడినట్టు తెలిపారు.
కరోనా సమస్య పరిష్కారమై స్కూల్, కాలేజీ మళ్లీ ఎప్పుడు పునః ప్రారంభమవుతాయో అని యశ్వంత్ ఆందోళన చెందాడని.అయితే ఇంట్లో ఎవరు లేని సమయం చూసి అతను ఆత్మహత్య చేసుకున్నాడు.
తండ్రి ఇంటికి వచ్చేసరికి ఉరికి వేలాడుతున్న అబ్బాయిని చూసి స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు.