మీ జుట్టు న‌ల్ల‌గా నిగనిగలాడాలా..స్ట్రాబెర్రీలతో ఇలా చేయండి?

జుట్టు న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడుతూ ఉంటే ఎంత అందంగా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

కానీ, నేటి కాలంలో కాలుష్యం, దుమ్ము ధూళి, ఆహార‌పు అల‌వాట్లు, స‌రైన కేరింగ్ లేక‌పోవ‌డం, పోష‌కాల లోపం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల చాలా మంది కేశాలు డ్రైగా, పొట్లిపోయి అందహీనంగా క‌నిపిస్తుంటాయి.

దీంతో బ్యూటీ పార్ల‌ర్స్ చుట్టూ తిరుగుతూ హెయిర్ ప్యాక్‌లు, ట్రీట్మెంట్లు చేయించుకుంటారు.కానీ, న్యాచుర‌ల్‌గా కూడా జుట్టును న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడేలా చేసుకోవ‌చ్చు.

స్ట్రాబెర్రీలు కేశ సంర‌క్ష‌ణ‌లో అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి స్ట్రాబెర్రీలను కేశాల‌కు ఎలా ఉప‌యోగించాలో లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా స్ట్రాబెర్రీలను తీసుకుని మెత్త‌గా పేస్ట్‌లో చేసుకోవాలి.ఇప్పుడు ఆ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు, నిమ్మ ర‌సం క‌లిపి జుట్టుకు, కుదుళ్ల‌గా బాగా ప‌ట్టించాలి.

Advertisement

గంట పాటు వ‌దిలేసి ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో త‌ల స్నానం చేయాలి.ఇలా చేస్తే జుట్టు న‌ల్ల‌గా నిగ‌నిగ‌లాడుతూ క‌నిపిస్తుంది.

మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య కూడా త‌గ్గుముఖం ప‌డుతుంది.

అలాగే స్ట్రాబెర్రీలను పేస్ట్‌లా చేసుకుని అందులో కొద్దిగా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ మిశ్ర‌మంతో హెయిర్ ప్యాక్ వేసి అర గంట లేదా గంట పాటు ఆర‌నివ్వాలి.ఆ త‌ర్వాత మామూలు షాంపూతో హెడ్ బాత్ చేసేయాలి.

ఇలా వారంలో ఒక సారి చేస్తే కేశాలు షైనీగా మార‌తాయి.ఇక చుండ్రును స‌మ‌స్యకు చెక్ పెట్ట‌డంలోనూ స్ట్రాబెర్రీలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

స్ట్రాబెర్రీల పేస్ట్‌లో ఎగ్ వైట్ మ‌రియు నిమ్మ ర‌సం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు ప‌ట్టించి.

Advertisement

గంట పాటు వ‌ద‌లేయాలి.అనంత‌రం త‌ల స్నానం చేసేయాలి.

ఇలా వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చుండ్రు స‌మ‌స్య పోతుంది.‌‌.

తాజా వార్తలు