ఆ నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీలో విచిత్ర‌మైన ప‌రిస్థితి.. న‌డిపించేవారు లేక‌..

వైసీపీలో కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల‌కు కూడా కొద‌వ లేకుండా నిండు స‌ముద్రంలా ఉంటే టీడీపీ ప‌రిస్థితి మాత్రం ఎండిపోయిన చెరువులా త‌యారవుతోంది.

ఎందుకంటే ఆ పార్టీలో కార్య‌క‌ర్త‌లు కాదు క‌దా క‌నీసం నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా పార్టీని న‌డిపించే నాయ‌కులు లేరు.

చాలామంది ఏవేవో కార‌ణాల‌తో పార్టీని వీడుతూనే ఉన్నారు.దీంతో అస‌లు పార్టీకి ఉనికి ఉంటుందా అని అంతా షాక్ అవుతున్నారు.

ఇప్పుడు చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న కొంద‌రు నాయ‌కులు మాత్రం జంప్ చేయడం లేదంటే ఏవో సాకులు చెబుతూ పార్టీకి తటస్థంగా వ్యవహరించడం లాంటివి చేస్తున్నారు.ఇప్పుడు ఎగ్జాంపుల్ కు చూసుకుంటే ప్రత్తిపాడు నియోజకవర్గం అలాగే బాపట్ల పార్లమెంటు కాన్సిస్టెన్సీలో ఇదే ప‌రిస్థితి త‌యావుతోంది.

ఇక్క‌డ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గానికి రిజ‌ర్వు కావ‌డంతో అస‌లు ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని న‌డిపించే ఆ వ‌ర్గాల్లో నాయ‌కులు లేకుండా పోతున్నారు.ఇంకోవైపు కృష్ణాజిల్లా పామర్రు అసెంబ్లీ నియోజకవర్గం అలాగే తిరువూరు లాంటి ఏరియాల్లో ఎస్సీ వ‌ర్గాల్లో న‌డిపించే నాయ‌కులు లేకుండా పోతున్నారు.

Advertisement

క‌నీసం పోటీ చేసేందుకు త‌గ్గ నేత‌లు కూడా ముందుకు రావ‌ట్లేదు.ఈ ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి పెద్ద దిక్కుగా వేరే వ‌ర్గాల వారు ఉంటున్నారు.

ఈ కార‌ణంగా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు చెందిన వారు ఎద‌గ‌ట్లేద‌ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.ఉదాహ‌ర‌ణ‌కు ప్రత్తిపాడును తీసుకుంటే ఈ నియోజ‌క‌వ‌ర్గం మాకినేని పెదరత్తయ్య చూసుకుంటున్నారు.

మ‌రి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటే మాత్రం కొత్త నాయ‌కుడు దొర‌క‌ట్లేదు.ఇక‌పోతే చిత్తూరులో కూడా సత్యప్రభ చ‌నిపోయిన తర్వాత ఆ స్థాయిలో కొత్త నాయ‌కులు రావ‌ట్లేదు.

ఇలా రాష్ట్రంలోని చాలా ఎస్సీ రిజ‌ర్వుడు నియోజ‌క‌వ‌ర్గాల్లో అస‌లు పార్టీకి కేండిడేట్లు దొర‌క‌ట్లేద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి.మ‌రి చంద్ర‌బాబు కొత్త వారికి ఎంత త్వ‌ర‌గా ప‌ద‌వులు ఇచ్చి అంత త్వ‌ర‌గా ప్ర‌జ‌ల్లోకి పంపించాల‌ని త‌మ్ముళ్లు కోరుతున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 
Advertisement

తాజా వార్తలు