వైరల్: పుచ్చకాయ పాప్‌కార్న్ ఎపుడైనా తిన్నారా? ఒకసారి ట్రై చేసి చూడండిలా!

సాధారణ పాప్‌కార్న్ గురించి అందరికీ తెలిసినదే.అదే పాప్‌కార్న్ ని వినూత్న రీతిలో తయారు చేసాడొక ఔత్సాహికుడు.

 Strange Recipe Watermelon Popcorn Making Video Viral On Social Media Details, V-TeluguStop.com

సోషల్ మీడియా పరిధి పెరుగుతున్నవేళ, ఇలాంటి పలు రకాల వంటకాలు ఇటీవల వైరల్ అవుతున్నాయి.ఈ మధ్యకాలంలో చూసుకుంటే.

టమోటా కచోరి, చాక్లెట్ సమోసా, వెజ్ ఫిష్ ఫ్రై, ఐస్ క్రీం కచోరి, పచ్చి మిర్చి హల్వా, కొత్తిమీర ఐస్ క్రీం ఇలా అనేక రకాల రకాల వంటకాలు నెట్టింట బాగా వైరల్ అవ్వడం అందరికీ తెలిసినదే.ఈ క్రమంలో తాజాగా మరో సరికొత్త తాజా వంటకం నెట్టింట హల్ చల్ చేస్తోంది.

మరి అతగాడికి ఎలా ఆ ఆలోచన వచ్చిందో తెలియదు కానీ, చూడటానికి బాగానే వుంది.రుచి చూడాలంటే మాత్రం ఇంటిలో కుంపటి పెట్టాల్సిందే.సదరు వీడియోలో ఏముందో ఒకసారి చూసుకున్నట్లయితే, సలసలా కాగే నూనెలో ఓ పుచ్చకాయ (Watermelon) ముక్కను వేసి దాని గుజ్జుని అందులో మరిగించాడు.కాసేపటికి ఆ నూనె ఎర్రని రక్తం మాదిరి తయారయ్యింది.

దాన్ని కూడా కాసేపు మరిగించిన తరువాత మొక్కజొన్న ప్యాకెట్ ను అందులో వేసాడు.వెంటనే మొక్కజొన్న గింజలు పాప్ కార్న్‌గా మారిపోతాయి.

బేసిగ్గా వైట్ ఎల్లో కలర్ లో ఉండాల్సినవి కాస్త ఎర్రగా కనబడతాయి.ఐడియా బాగుంది కదూ.ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి.

అక్కడి వరకు బానే వుంది కానీ, సో కాల్డ్ వంటకాన్ని చూసిన నెటిజన్స్ మాత్రం భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.ఇదేదో బాగావుంది, ట్రై చేద్దాం అని కొందరు కామెంట్లు పెడుతుంటే, మరికొందరు ఇదేం పైత్యం రా నాయనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఈ వినూత్న రీతిలో తయారు చేసిన పాప్‌కార్న్ వీడియోను కప్తాన్ హిందూస్తాన్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ట్విట్టర్‌లో షేర్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

మీరు కూడా ఓసారి చూసి అభిప్రాయాన్ని తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube