సోషల్ మీడియాలో వైరలయ్యే కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే.తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వీడియోని చూసి బయాలజిస్టులు సైతం అవాక్కవుతున్నారు.అందుకు కారణం ఈ వీడియోలో ఎవరికీ అంతుపట్టని ఒక వింత జీవి కనిపించడమేనని చెప్పొచ్చు.
ఇది చిన్న ఆకారంలో ఉన్నప్పటికీ ఏనుగు లాంటి ఆకారాన్ని కలిగి ఉంది.ఇలాంటి ఒక వికృతమైన జీవిని చూసి ఇది ఒక ఏలియన్ అయి ఉండొచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.ఆస్ట్రేలియాలోని బిగ్గెస్ట్ సిటీ అయిన సిడ్నీలో సోమవారం ఉదయం హ్యారీ హేస్ అనే వ్యక్తి జాగింగ్ చేస్తున్నాడు.ఈ క్రమంలోనే అతడు జాగింగ్ చేస్తున్న రోడ్డుపై ఒక వింత జీవి కనిపించింది.అది చూసేందుకు ఒక జంతువు పిండంలా కనిపించింది.
దాన్ని మరింత పరిశీలించి చూడగా ముందు భాగంలో ఏనుగు తొండంలా ఒక పార్ట్ కనిపించింది.దీన్ని ఒక కట్టెపుల్లతో కూడా అతడు కదిలించి చూశాడు.
కానీ అది ఎలాంటి చలనం లేకుండా పడి ఉంది.బహుశా అది చనిపోయిందేమోనని హ్యారీ హేస్ భావించాడు.
తర్వాత దీన్ని వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో అప్‌లోడ్ చేశాడు.
అలా అప్‌లోడ్ చేయగానే ఇది ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు వామ్మో ఇదేంటి, ఇలా ఉంది? కొంపతీసి గ్రహాంతరవాసా? అని కామెంట్లు పెడుతున్నారు.కొందరు మాత్రం ఇది ఏలియన్ కాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఇది షార్క్ లేదా ఇతర సముద్ర జీవి పిండం అయి ఉండొచ్చని గెస్ చేస్తున్నారు.కానీ ఎవరూ కూడా కచ్చితంగా సమాధానం చెప్పలేకపోతున్నారు.దీంతో ప్రముఖ బయాలజిస్టులు ఇది ఏంటో కనిపెట్టడానికి ముందుకొచ్చారు.కానీ వారికి కూడా ఇది ఏంటో అర్థం కాలేదు.
అది ఉడుత లాంటి జీవి అయి ఉండొచ్చునని కొందరు అభిప్రాయపడగా దాన్ని ఎవరూ అంగీకరించలేదు.సిడ్నీ యూనివర్శిటీ, న్యూ సౌత్ వేల్స్ యూనివర్శిటీ విద్యావేత్తలు కూడా ఇది ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నించారు కానీ విఫలమయ్యారు.
దీంతో ఈ వింత జీవి ఏమై ఉంటుందని నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు.ఈ వీడియోని మీరు కూడా ఒక చూసేయండి.