ఎవరు ఈ పొన్నియన్ సెల్వన్..ఈయన స్టోరీ ఏంటో తెలుసా ?

దాదాపుగా ముప్పై సంవత్సరాలుగా మణిరత్నం యొక్క డ్రీమ్ ఒక్కటే.అదే పొన్నియన్ సెల్వన్ స్టోరీ ని సినిమాగా తీయాలని.

 Story About Ponniyan Selvan Details, Ponniyin Selvan, Chola King, Director Mani-TeluguStop.com

ఎట్టకేలకు ఇన్నేళ్ల నిరీక్షణ తర్వాత ఈ నవల సినిమా రూపంలో రాబోతుంది.అంతే కాదు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు.

ఈ సినిమా మొదటి భాగాన్ని ఈనెల 30వ తారీఖున ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు.ఇప్పటికే 2010లో ఓసారి ఈ చిత్రం ప్రారంభం జరగబోయి, లొకేషన్స్ దొరకని కారణంగా ఆగిపోయింది.500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీయబడ్డ ఈ సాహిత్య రచన పదవ శతాబ్దంలో జరిగిన చోలుల పాలన నేపద్యంలో తిరిగెక్కింది.

అయితే ఈ సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే అసలు ఎవరు ఈ చోళ రాజు ? ఈ రాజు యొక్క చరిత్ర ఏంటి ? ఈ సినిమాలో అంత విషయం ఏముంది అని.భారీ తారాగణంతో వస్తున్న ఈ సినిమాలో ఈ చోళ రాజు యొక్క అసలు చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.శ్రీలంక లోని పోన్నియన్ సెల్వన్ రాజా రాజా చోళన్ కి అతడి సైన్యానికి కమాండర్ అయిన వల్లవరైయన్ వంద్యదేవన్ మధ్య జరిగిన సంఘనలను కలిపి సినిమాగా తీయడం జరిగింది.

Telugu Aishwarya Rai, Chola, Mani Ratnam, Jayam Ravi, Karthi, Ponniyan Selvan, P

ఈ కథ కి ముఖ్య పాత్ర పొన్నియన్ సెల్వన్ దే.ఈ పేరుకు అర్దం ఏమిటి అంటే నది పుత్రుడు అని.రాజా రాజా చోళుడు ఒకరోజు నదిలో మునిగిపోతే ఆ నది అతడిని కాపాడిందని అందుకే అతడి ఆ పేరును బిరుదు గా వచ్చిందని పురాణం చెప్తుంది.వాస్తవానికి పొన్నియన్ సెల్వన్ అసలు పేరు అరుళ్ మొళి వర్మన్.

అయితే అతడు చోళ రాజ్య సింహాసనం ఎక్కగానే తన పేరును పొన్నియన్ సెల్వన్ రాజా రాజా చోళుడిగా మార్చుకున్నాడు.ఇతడి పాలనలో ఎంతో చారితరాత్మకమైన బృహదీశ్వర ఆలయం నిర్మాణం జరిగింది.

Telugu Aishwarya Rai, Chola, Mani Ratnam, Jayam Ravi, Karthi, Ponniyan Selvan, P

దీనికి వాడిన టెక్నాలజీ ఇన్ని వందల ఏళ్ల తర్వాత కూడా ఇప్పటి శాస్త్రవేత్తలకు అర్దం కావడం లేదు.అయితే ఈ సినిమాలో మాత్రం పోన్నియన్ రాజు కాక ముందు జరిగిన సంఘటనలు కలిపి మొదటి భాగాన్ని తీయడం జరిగింది.చోళ రాజ్యంలో పొన్నియన్ పాలనను స్వర్ణ యుగం అంటారు.సింహాసనం కోసం జరిగే ఎత్తుగడలతో ఎక్కువ భాగం సినిమా షూట్ జరిగింది.ఇక ఈ చిత్రంలో ఐశ్వర్య రాయ్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి , విక్రమ్, కార్తీ, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో నటించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube