Steps Need To Take In Case Of Property Forgery Documents Details

Steps Need To Take In Case Of Property Forgery Documents Details

మీరు ఆస్తికి సంబంధించి అనేక రకాల వివాదాల గురించి విని ఉంటారు.కొంత మంది ఇతరుల ఆస్తిపై హక్కులు పొందేందుకు నకిలీ పత్రాలను కూడా సృష్టిస్తున్నారు.

 Steps Need To Take In Case Of Property Forgery Documents Details-TeluguStop.com

వారు ఈ ఆస్తిని తమ స్వాధీనం చేసుకునేందుకు ఫోర్జరీని ఆశ్రయిస్తుంటారు.దీని సహాయంతో ఆస్తిని మరొకరి పేరుకు బదిలీ చేస్తారు.

ఈ తరహా మోసాలకు పాల్పడేవారు నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు.ఇటువంటి పరిస్థితిలో ఎవరైనా మీ ఆస్తిని ఈ విధంగా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇలాంటి సందర్భాల్లో దీనిని గుర్తించిన వెంటనే ఈ విషయమై దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని న్యాయ నిపుణులు చెబుతున్నారు.ఎవరైనా మీ ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే పోలీసులకు ఫిర్యాదు దాఖలు చేయడం మీ మొదటి అడుగు.

దీని గురించి మీకు వీలైతే, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ లేదా సబ్-రిజిస్ట్రార్‌కు కూడా రాత పూర్వక సమాచారం కూడా ఇవ్వవచ్చు.ఈ రాత పూర్వక సమాచారంలో ఇటు వంటి పరిస్థితి ఎలా ఏర్పడిందో మీరు ఖచ్చితంగా చెప్పాలి.

అది మీ సమస్య తీవ్రత గురించి వారికి తెలియ జేస్తుంది.

ఇదే విధంగా మీరు మీ ప్రాంతంలోని వార్తా పత్రికలో దీనికి సంబంధించిన ప్రకటన కూడా ఇవ్వవచ్చు.

దానిలో మీ ఆస్తిని విక్రయించ లేదని, దానికి సంబంధించి ఎలాంటి లావాదేవీలు చేయ లేదని తెలియ జేయాలి.ఇటువంటి ప్రయత్నం ద్వారా మీ ఆస్తిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలకు అడ్డుకట్ట పడుతుంది.

న్యాయ నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం ఇటువంటి మోసాలకు పాల్పడే వారిపై ఐపిసిలోని సెక్షన్లు 420 (మోసం), 467 (కాగితాలను ఫోర్జరీ చేయడం), 468 (మోసించాలనే ఉద్దేశ్యంతో ఫోర్జరీ), 471 (నకిలీ కాగితాన్ని అసలైనదిగా చూపడం) కింద కేసులు నమోదు చేయవచ్చు – telugu-title:ఎవరైనా నకిలీ డాక్యుమెంట్స్‌తో మీ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తే.వెంటనే ఏమి చేయాలంటే.Read More ??https:/telugustop.com/?p=1916474 – Telugu News #TeluguNews #TeluguBreaking #Telugu #TeluguStop | Telugu news #Assets #Forgery #SubRegistrar #TeluguNews Channel:Telugu News

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube