వైరల్‌ : అమ్మకంకు ‘స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ’.. కారణం ఏంటీ.. ధర ఎంతో తెలుసా?

ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహంగా మోడీ ప్రభుత్వం స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ పేరుతో సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహంను గుజరాత్‌లోని నర్మదా నది తీరంలో ఏర్పాటు చేసిన విషయం తెల్సిందే.

ఆ విగ్రహంకు మూడు వేల కోట్లకు పైగా కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.

అనధికారికంగా అంతకు మించే ఆ విగ్రహంకు ఖర్చు చేసి ఉంటారు అనేది కొందరి వాదన.ఎవరి వాదన ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ఆ విగ్రహం మరోసారి వార్తల్లోకి వచ్చింది.

కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి పాత వస్తువులు అమ్మకం కొనుగోలు చేసే ఓఎల్‌ఎక్స్‌ లో ఈ విగ్రహంను అమ్మకంకు ఉంచినట్లుగా పెట్టినాడు.ఆయన ఈ విగ్రహం ఖరీదును ఏకంగా 30 వేల కోట్ల రూపాయుగా పేర్కొన్నాడు.

ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాంఢవం చేస్తున్న నేపథ్యంలో ఈ విగ్రహంను అమ్మేసి ఆ డబ్బుతో ప్రజలకు వైధ్యం అందించే ఉద్దేశ్యంతో అతడు ఈ పని చేసినట్లుగా పేర్కొన్నాడు.అయితే అతడి పేరు ఊరు చెప్పక పోవడం ప్రస్తుతం చర్చనీయాంశం అవుతుంది.

Advertisement

ప్రతిష్ట కోసం పటేల్‌ సాబ్‌ విగ్రహంను మూడు వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేశారు.ఆ డబ్బులో కొద్ది భాగం ఉంచినా కూడా ప్రస్తుతం కరోనా విపత్తు సమయంలో ఉపయోగపడేది కదా అంటూ అతడు ప్రశ్నిస్తున్నాడు.

అతడు లేవనెత్తిన ఈ ప్రశ్న ప్రస్తుతం సోషల్‌ మీడియా లో వైరల్‌ అవుతోంది.అతడు అన్నమాటలో నిజం ఉంది కదా అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీ పేరుతో ఏర్పాటు చేసిన ఆ విగ్రహం ప్రస్తుతం కరోనా విపత్తు నుండి మన దేశాన్ని కాపాడుతుందా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.ఇంత భారీగా ఖర్చు చేసే బదులు పెద్ద ఎత్తున హాస్పిటల్స్‌ నిర్మించడం చేస్తే ఇప్పుడు ఉపయోగపడేవి కదా అంటున్నారు.

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు