ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు, నర్సింగ్ కళాశాల ప్రారంభం

టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌లోని తార్నాక ఆర్టీసీ ఆసుపత్రిలో అత్యాధునిక వసతులు కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.గురువారం నర్సింగ్ కళాశాలతో పాటు ఆక్సిజన్‌ ప్లాంట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, అంబులెన్స్ లు మరియు ఆసుపత్రి పరిపాలన భవనాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రారంభించారు.

 State Of The Art Facilities At Rtc Hospital, Start Of Nursing College , Rtc Ho-TeluguStop.com

గతంలో నామమాత్రపు వైద్యసేవలకే పరిమితమైన ఈ దవాఖానను ప్రభుత్వం సకల వసతులతో బలోపేతం చేస్తున్నదని ప్రత్యేకించి ఆర్టీసీ సిబ్బంది వైద్యానికి భరోసా ఇచ్చేలా దవాఖానను తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.ఇదివరకూ ప్రైవేటు దవాఖానలకు సిబ్బంది రిఫర్‌ చేయడం వల్ల సంస్థ మీద ఏటా రూ.40 కోట్ల భారం పడేదని ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని శాశ్వత ఏర్పాట్లు చేసే వెసులుబాటు కలిగిందన్నారు.

తార్నాక ఆర్టీసీ ఆసుపత్రి ఆవరణలోనే ఈ ఏడాది నుంచి నర్సింగ్‌ కళాశాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని దీనిలో ఆర్టీసీ సిబ్బంది పిల్లలకు ఐదు సీట్లను కేటాయిస్తున్నారని తెలిపారు.

త్వరలోనే వొకేషనల్‌ కాలేజీ ఏర్పాటుకు కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ హామీ ఇచ్చారు.

Telugu Ambulance, Baji Govardhan, Doctors, Theater Complex, Oxygen, Rtc, Tarnaka

రూ.80 లక్షల వ్యయంతో 20 పడకల ఐసీయూను తొలిసారిగా అందుబాటులోకి తెచ్చామని నాలుగుబెడ్లతో కిడ్నీ సెంటర్‌ నెలకొల్పామని రూ.15 లక్షల వ్యయంతో డయాలసిస్‌ మిషన్‌ ఏర్పాటు చేశామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పారు అదేవిధంగా రూ.1.2 కోట్లతో రౌండ్‌టేబుల్‌ ఇండియా సంస్థ ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో రోగులకు ఉపశమనంగా మారిందని మంత్రి అన్నారు.

Telugu Ambulance, Baji Govardhan, Doctors, Theater Complex, Oxygen, Rtc, Tarnaka

రోగులు, వారి సహాయకులు, సిబ్బంది కోసం రూ.1.5 కోట్లతో క్యాంటీన్‌ను అందుబాటులో ఉందని రోగులకు అన్ని రకాల మందులను ఉచితంగా అందిస్తున్నామని అన్నారు.ప్రస్తుతం ఆసుపత్రిలో నాలుగు ఆపరేషన్‌ థియేటర్లు అందుబాటులో ఉన్నాయని అదేవిధంగా అతి త్వరలోనే ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌, క్యాథ్‌ల్యాబ్‌ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వివరించారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్టీసీ ఎండీ వి.సి.సజ్జనార్, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube