రాష్ట్ర మంత్రులు కొడాలి నాని ,పేర్ని నానిలకు కృష్ణాజిల్లా గుడివాడలో పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది.

పట్టణంలోని జి 3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని,కొడాలి నానిలను కు అడ్డు కునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. జై పవన్ కళ్యాణ్,ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటు అభిమానులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

 State Ministers Kodali Nani And Perni Nani Were Attacked By Pawan Kalyan Fans In-TeluguStop.com

థియేటర్లో భీమానాయక్ ప్రారంభ చిత్రం కావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.జి 3 థియేటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న గుడివాడ జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ తో  పాటుగా పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాలను కక్ష పూరితంగా అడ్డుకోవడం దారుణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.సినీ ఫోటో గ్రాఫి శాఖ మంత్రికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు వచ్చిన తమను అరెస్ట్ చెయ్యడం ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి నిదర్శన మని పవన్ కళ్యాణ్ అభిమానులు మండి పడ్డారు.

State Ministers Kodali Nani And Perni Nani Were Attacked By Pawan Kalyan Fans In Krishnajilla Gudi

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube