రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్న హార్డర్ వేర్ పార్క్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ లను ఎందుకు తీసుకోవడం లేదు ? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి – బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోమువీర్రాజు డిమాండ్.రాష్ట్ర విభజన సమయంలో బిజేపీ వత్తిడిపై కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన పరిశ్రమలు, కారిడార్’లనకు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించి, వాటిని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైనది ? అంటూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ సోమువీర్రాజు నిప్పులు చెరిగారు.నేను సూటిగా ప్రశ్నిస్తున్నా ? ఈ ముఖ్యమంత్రిని, బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో బిజేపీ కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ కు ఇవ్వడం ద్వారా రాష్ట్రాభివృద్ధికి బిజేపి భాగస్వామ్యాన్ని చొరవ చూపిస్తుంటే రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి కేంద్రం కేటాయించిన సంస్థలను ఏర్పాటు చేయడానికి అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోకుండా.
వాటికోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వినియోగిస్తుందో జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ, విభజన బిల్లులో లేనప్పటికీ హార్డ్వేర్ పార్క్ తో పాటు, రెండు యూనివర్సిటీల ఏర్పాటు చేయడానికి, కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని 2014 లోనే పార్లమెంటు సాక్షిగా, నేటి కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రస్తావించినా కూడా నాటి టీడీపీ నేటి వైసీపీ పార్టీ ప్రభుత్వాలు రెండు కూడా విస్మరించడం తో పాటు,నేటి వైసీపీ ప్రభుత్వం తూర్పు గోదావరిజిల్లా,కాకినాడ ప్రాంతంలో హార్డ్వేర్ పార్క్ కోసం సంస్థ ఏర్పాటుకు కృష్ణాజిల్లా గన్నవరం ప్రాంతంలోని, కొండపావులూరులలో కేటాయించిన ఆయుర్వేద ప్రకృతి చికిత్సాలయానికి కేటాయించిన భూములను ఇండ్ల స్థలాలకు కేటాయించడం ద్వారా నిధులను దారి మళ్ళించడం ద్వారా మీ ప్రభుత్వం ఓటు బ్యాంకు రాజకీయాలకు ఇస్తున్న ప్రాధాన్యత రాష్ట్రాభివృద్ధికి ఎందుకు ఇవ్వడంలేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన కేంద్ర మంత్రి కూడా ఈ అంశంపై పలుమార్లు గుర్తిచేసినా కూడా ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు లేదని, దీని వల్ల ఏమి ప్రయోజనాలు ఆశిస్తోందో రాష్ట్రంలోని యువతకు సమధానం చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు.ఏపీ అభివృద్ధికి నిరంతరం ప్రత్యేక దృష్టి సారిస్తు, సహకరిస్తున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి రాష్ట్ర ప్రజలు తరపున ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్నానంటూ సోము వీర్రాజు తన ప్రకటనలో పేర్కొన్నారు.ఏపీ’ని అభివ్రుద్ది చేయడంలో ప్రధానికి విజన్ ఉంది అందువల్ల బల్క్ డ్రగ్ పార్క్ మన రాష్ట్రానికి వస్తోంది, అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పుకుంటోంది అయితే విభజన బిల్లులో ఉన్న అనేక అంశాలు ఎందుకు సాధించడం లేదని శ్రీ సోము వీర్రాజు ప్రభుత్వాన్ని నిలదీశారు.
గతంలో పార్లమెంటులో హార్డ్ వేర్ పార్క్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి బిల్లులో వెసులు బాటు ఉందని చెప్పారు అయితే ఆనాటి నుండి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకురాలేదని దెప్పి పొడిచారు.
హార్డ్ వేర్ పార్క్ కాకినాడ కు వచ్చి ఉంటే ఇప్పటికే చాలా అభివ్రుద్ది జరిగి ఉండేది అందేవిధంగా పెట్రోకెమికల్ కాంప్లెక్స్ తీసుకుని వచ్చి ఉంటే లక్షల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పడేవి వీటి విషయంలో ఎందుకు చొరవ చూపడంలేదు.అదేవిధంగా విభజన బిల్లులో ప్రాస్తావించినవే కాకుండా ఇతర కేంద్ర సంస్థలు కూడా రాష్ట్రానికి వచ్చిన విషయం గుర్తు చేసారు.
అదేవిధంగా వైద్యకళాశాలలు ఇవ్వడానికి కేంద్రం ప్రభుత్వం ముందుకు వస్తే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం అంత వేగంగా స్పందించడంలేదని శ్రీ సోము వీర్రాజు అసహనం వ్యక్తం చేశారు.ఈ మేరకు బిజెపి రాష్ట్ర కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు.







