రాజశేఖర్ సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న రాజశేఖర్( Rajasekhar ) ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో సినిమాలను చేసి మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోవడంతో ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన లక్కు ను పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక అందులో భాగంగానే ఆయన చేసిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమా( Extra ordinary man movie ) డిజాస్టర్ అవడంతో ఆయన పాత్రకి అంత గుర్థింపైతే రాలేదు.దాంతో ఇప్పుడు చేయబోయే సినిమాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక అందులో భాగంగానే స్టార్ హీరోల సినిమాల్లో విలన్ పాత్రలని పోషించడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటే రాజశేఖర్ ఒకప్పుడు మంచి సినిమాలు చేసి స్టార్ హీరో గా తనకంటూ ఒక ఓపెన్ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.అయితే రాజశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా మా అన్నయ్య సినిమాను( Ma Annayya ) చేశాడు.

అయితే ఈ సినిమాలో మీనా హీరోయిన్ గా నటించిన విషయం మనకు తెలిసిందే.అయితే ముందే రాజశేఖర్ మరొక స్టార్ హీరోయిన్ ని అడిగారట.ఆమె ఎవరు అంటే రమ్యకృష్ణ( Ramya Krishna ).

Advertisement

ఇక రమ్యకృష్ణ అప్పటికే వరుస సినిమాలకు కమిట్ అయి ఉండడంవల్ల ఈ సినిమాను వదిలేసుకోవాల్సి వచ్చిందట.రమ్యకృష్ణ రాజశేఖర్ కాంబినేషన్ లో అంతకుముందు అల్లరి ప్రియుడు, దీర్ఘ సుమంగళీభవ లాంటి సినిమాలు కూడా వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి.అందువల్లే రాజశేఖర్ రమ్యకృష్ణ కాంబినేషన్ లో మరొక మంచి సినిమా వస్తుందని భావించి ఆమెను అడిగాడట.

కానీ ఆమె మాత్రం ఆ ఆ సినిమా చేయలేకపోయింది.ఇక మొత్తానికైతే ఈ సినిమాలో మీనా హీరోయిన్ గా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా క్రియేట్ చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు