స్టార్ హీరో ధనుష్ కొత్తింటి ఖర్చు అన్ని కోట్లా.. స్టార్స్ సైతం షాకయ్యేలా?

సాధారణంగా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కట్టాలంటే కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేయడానికి సాహసించరు.

సెలబ్రిటీలు, బడా వ్యాపారులు మాత్రం తమ స్థాయికి తగినట్టు 5 కోట్ల రూపాయల నుంచి 50 కోట్ల రూపాయల రేంజ్ లో ఇల్లు కట్టుకోవడానికి ఖర్చు చేస్తారు.

అయితే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం తన ఇంటి కోసం ఏకంగా 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నారు.ధనుష్ ఇంటికోసం చేస్తున్న ఖర్చు గురించి తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

ఇతర స్టార్ హీరోలు సైతం అవాక్కయ్యే ఖర్చుతో ధనుష్ ఇంటిని నిర్మిస్తుండటం గమనార్హం.ప్రస్తుతం సినిమాల ద్వారా తీసుకుంటున్న పారితోషికాన్ని ధనుష్ ఈ విధంగా ఖర్చు చేయిస్తుండటం గమనార్హం.

ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఈ స్టార్ హీరో రెమ్యునరేషన్ ను తీసుకుంటున్నారు.ఏడాదికి మూడు సినిమాల్లో నటిస్తున్న ధనుష్ ఇల్లు కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Advertisement

తమిళ సినిమాలతో పాటు తెలుగు సినిమాలలో కూడా ధనుష్ నటిస్తుండటం గమనార్హం.

టాలీవుడ్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించడానికి ధనుష్ ఆసక్తి చూపిస్తున్నారు.ప్రస్తుతం శేఖర్ కమ్ముల, వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ధనుష్ నటిస్తుండగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు కూడా ధనుష్ తో కలిసి పని చేయడానికి ఆసక్తి చూపిస్తారేమో చూడాల్సి ఉంది.ఈ మధ్య కాలంలో విడాకుల వార్తల ద్వారా ధనుష్ ఐశ్వర్య వార్తల్లో నిలిచారు.

ఐశ్వర్య ధనుష్ మళ్లీ కలిసే అవకాశం ఉందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.పెద్ద మనుషులు జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించారని తెలుస్తోంది.ధనుష్ 300 కోట్ల రూపాయలతో చెన్నైలో ఇంటిని నిర్మించనున్నారని సమాచారం అందుతోంది.

సినిమాసినిమాకు ధనుష్ కు క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం.

మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?
Advertisement

తాజా వార్తలు