సీనియర్ ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలలో చాలామంది భావిస్తారు.చంద్రబాబు వెన్నుపోటు విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ సీజన్2 తొలి ఎపిసోడ్ ప్రసారం కాగా 1995 సంవత్సరంలో ఎదురైన పరిస్థితులకు సంబంధించి అటు చంద్రబాబు ఇటు బాలయ్య కీలక విషయాలను వెల్లడించారు.1995 సంవత్సరంలో తీసుకున్న డెసిషన్ బిగ్ డెసిషన్ అని చంద్రబాబు అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ ఒక ఆశయం కోసం పార్టీ పెట్టి పోరాడాడని ప్రజలే దేవుళ్లు సమాజమే దేవాలయం అని ఆయన భావించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.1995లో ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేశారని ఆ నిర్ణయం వెనకాల సాక్ష్యం 5 మంది అని చంద్రబాబు చెప్పగా ఆరోజు నాకు ఇంకా గుర్తుంది బావా అని బాలయ్య కామెంట్లు చేశారు.నేను, మీరు, హరికృష్ణ అన్నయ్య, బీవీ మోహన్ రెడ్డి నాన్నగారి దగ్గరికి వెళ్లామని బాలయ్య చెప్పుకొచ్చారు.
లోపలికి వెళ్లిన సమయంలో రాజకీయం అయితే నేను మాత్రమే మాట్లాడాలని చెప్పి పెద్దాయన అందరినీ బయటకు పంపించారని చంద్రబాబు చెప్పుకొచ్చారు.మూడు గంటల పాటు అన్నీ వివరించి మీటింగ్ పెట్టాలని సూచించానని ఎమ్మెల్యేలను కన్సోల్ చేస్తే చాలని సీనియర్ ఎన్టీఆర్ కు చెప్పానని చంద్రబాబు అన్నారు.రాముడు ఆంజనేయస్వామి మధ్య రామాంజనేయ యుద్ధం జరిగిందని ఆరోజు నిర్ణయం అనేది సీనియర్ ఎన్టీఆర్ కంటే ఆయన సిద్ధాంతాలను కాపాడాలని తీసుకున్న నిర్ణయమని చంద్రబాబు తెలిపారు.
అందుకు బాలయ్యే సాక్ష్యమని చంద్రబాబు చెప్పుకొచ్చారు.సీనియర్ ఎన్టీఆర్ తో ప్రయత్నాలు ఫెయిల్ కావడంతో ఆ నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు అన్నారు.ఆరోజు మనం తీసుకున్న నిర్ణయం తప్పా అనే ప్రశ్నకు బాలయ్య స్పందిస్తూ నాన్నకు నాయకుడిగా కంటే పర్సనల్ ఎమోషన్ ఆ సమయంలో పెరిగిపోయిందని అన్నారు.ఆయన ఇష్టాన్ని మనం ఎప్పుడూ కాదనలేదని బాలయ్య తెలిపారు.
ఆ సమయంలో నాన్న ఒక కన్ఫ్యూజన్ లో పడ్డారని బాలయ్య అన్నారు.ఆరోజు మనం తీసుకున్న నిర్ణయం రైట్ అని నందమూరి కుటుంబ సభ్యుడిగా చెబుతున్నానని బాలయ్య తెలిపారు.1999 ఎన్నికల ఫలితాలు అదే ప్రూవ్ చేశాయని బాలయ్య చెప్పుకొచ్చారు.