అమ్మ చేసిన అద్భుతం వల్లే ఏఎన్నార్ స్టార్ హీరో అయ్యారట.. ఏమైందంటే?

1923వ సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీన సాధారణ రైతు కుటుంబంలో అక్కినేని నాగేశ్వరరావు జన్మించారు.

తన సినీ కెరీర్ లో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో దాదాపుగా 255 సినిమాల్లో ఏఎన్నార్ నటించారు.

అదృష్టం కంటే శ్రమనే ఎక్కువగా నమ్మే ఏఎన్నార్ కెరీర్ తొలినాళ్లలో కష్టాలు పడినా అగ్ర నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకోవడం గమనార్హం.జానపద, పౌరాణికాలతో పాటు ప్రేమకథలతో కూడా ఏఎన్నార్ విజయాలను అందుకున్నారు.

దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం సినిమాలు నాగేశ్వరరావు కెరీర్ లో హిట్లుగా నిలవడంతో పాటు ఆయనలో అద్భుత నటుడిని ప్రేక్షకులకు పరిచయం చేశాయి.తన నటనతో ఏఎన్నార్ ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకోవడం గమనార్హం.1991 సంవత్సరంలో ఏఎన్నార్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ దక్కింది.కృష్ణా జిల్లాలోని రామాపురం అక్కినేని నాగేశ్వరరావు స్వగ్రామం.

అమ్మ చేసిన అద్భుతమే తన విజయానికి కారణమని ఏఎన్నార్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Advertisement

ఏఎన్నార్ కు 9 సంవత్సరాల వయస్సు ఉన్న సమయంలో వాటాగా 5 ఎకరాల పొలం ఉంది.ఏఎన్నార్ అమ్మ చదివించాలంటే పొలం అమ్మాల్సి ఉండటంతో కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పొలం అమ్మలేదు.నాలుగో తరగతి మధ్యలోనే ఆపేసిన ఏఎన్నార్ ఆ తర్వాత తల్లి ప్రోత్సాహంతో నాటకాల్లో చేరారు.

అమ్మ ఆలోచన వల్లే తాను నాటకాల్లో చేరి ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలను సొంతం చేసుకున్నానని ఏఎన్నార్ తెలిపారు.సుదీర్ఘకాలం నటుడిగా కెరీర్ ను కొనసాగించిన వాళ్లలో ఏఎన్నార్ కూడా ఒకరు.అయితే రాజకీయాలపై మాత్రం ఏఎన్నార్ ఆసక్తి చూపకపోవడం గమనార్హం.

సీనియర్ ఎన్టీఆర్ కోరినా ఏఎన్నార్ మాత్రం తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని చెప్పుకొచ్చారు.ఏఎన్నార్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి ఉంటే పాలిటిక్స్ లో కూడా సక్సెస్ సాధించేవారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు