టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా సందర్భాల్లో కథ నచ్చినా వేర్వేరు కారణాల వల్ల సినిమాల్లో నటించడానికి అంగీకరించరు.అలా రిజెక్ట్ చేసిన సినిమాలు తరువాత కాలంలో బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో పాటు ఆయా హీరోలకు మంచి పేరు తెచ్చిపెడుతూ ఉంటారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయగా బన్నీ రిజెక్ట్ చేసిన ఆ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.
అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలలో బోయపాటి శ్రీను రవితేజ కాంబినేషన్ లో తెరకెక్కిన భద్ర సినిమా ఒకటి.
గంగోత్రి, ఆర్య సినిమాలలో నటించి లవర్ బాయ్ గా గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ భద్ర యాక్షన్ మూవీ కావడంతో ఆ సినిమాలో నటించడానికి అంగీకరించలేదని తెలుస్తోంది.విజయ్ దేవరకొండకు స్టార్ డమ్ రావడానికి గీతా గోవిందం, అర్జున్ రెడ్డి సినిమాలు కారణమనే సంగతి తెలిసిందే.

ఈ రెండు సినిమాలలో నటించే ఛాన్స్ అల్లు అర్జున్ కే రాగా వేర్వేరు కారణాల వల్ల అల్లు అర్జున్ ఈ సినిమాలలో నటించడానికి అంగీకరించలేదు.రామ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన జగడం సినిమాలో నటించే ఛాన్స్ మొదట అల్లు అర్జున్ కే రాగా అల్లు అర్జున్ ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.ఆ తరువాత దిల్ రాజు సుకుమార్ మధ్య చిన్న సమస్య ఏర్పడటంతో సుకుమార్ రామ్ తో జగడం సినిమాను తెరకెక్కించారు.
జగడం సినిమా .కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా ఆ సినిమాకు అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారు.అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో నటిస్తున్నారు.
ఈ సినిమా టీజర్ లో బన్నీ కొత్తగా కనిపిస్తున్నారు.ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.