ప్రమోషన్స్ విషయంలో బన్నీకి బన్నీనే సాటి.. మిగతా హీరోలు ఈ విషయంలో మారతారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన అల్లు అర్జున్( Allu Arjun ) మరికొన్ని గంటల్లో పుష్ప ది రూల్( Pushpa The Rule ) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ ఏడాది ఏ సినిమాకు రాని స్థాయిలో ఈ సినిమాకు హైప్ వచ్చింది.

బన్నీకి ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది.ఆ ఇమేజ్ ను మరింత పెంచేలా పుష్ప ది రూల్ మూవీ ప్రమోషన్స్ జరిగాయని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు.

బన్నీ బీహార్ లో( Bihar ) ఈవెంట్ ప్లాన్ చేసి ఆ ఈవెంట్ కు లక్షల మంది అభిమానులు వచ్చేలా చేయడంతోనే పుష్ప ది రూల్ ను సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. అన్ స్టాపబుల్ షో( Unstoppable Show ) ద్వారా, ప్రీ రిలీజ్ ఈవెంట్ ద్వారా బన్నీ ఫ్యాన్స్ ను మెప్పించారు.

పుష్ప ది రూల్ కు 1000 కోట్ల బిజినెస్ జరిగిందనే ప్రచారం బన్నీకి ప్లస్ అయింది.టికెట్ రేట్ల విషయంలో వస్తున్న నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోకుండానే బన్నీ అడుగులు పడుతున్నాయి.

Advertisement

రెమ్యునరేషన్ కాకుండా పర్సంటేజ్ తీసుకోవడం వల్ల బన్నీకి రెమ్యునరేషన్ రూపంలో ఏకంగా 235 కోట్ల రూపాయలు దక్కాయి.బన్నీ భవిష్యత్తు సినిమాలకు ఇంతకు మించి రెమ్యునరేషన్ తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.బన్నీ తర్వాత మూవీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఫిక్స్ కాగా డిసెంబర్ నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూట్ జరగనుందని సమాచారం అందుతోంది.

ఒక సినిమా విషయంలో ఏ విధంగా వ్యవహరించాలో బన్నీని చూసి ఇతర హీరోలు నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పవచ్చు.బన్నీ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం భారీ హిట్లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.సినిమా సినిమాకు బన్నీ రేంజ్ పెరుగుతున్న నేపథ్యంలో బన్నీ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం చాలా విషయాలలో హీరో బన్నీని ఫాలో కావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అల్లు అర్జున్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.

బన్నీ సినిమా సినిమాకు అంతకంతకూ ఎదుగుతుండగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్.. ఈ నటిని గుర్తు పట్టారా?
Advertisement

తాజా వార్తలు