టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోల పారితోషికాలు ఊహించని స్థాయిలో ఉన్నాయి.100 కోట్ల రూపాయల రేంజ్ లో స్టార్ హీరోలు రెమ్యునరేషన్ తీసుకుంటున్న నేపథ్యంలో సినిమాల బడ్జెట్లు భారీగా పెరుగుతున్నాయి.ఈ పరిస్థితి వల్ల హిట్ టాక్ వచ్చిన సినిమాలకు మాత్రమే భారీగా లాభాలు వస్తున్నాయి.కోలీవుడ్ ఇండస్ట్రీలోని పాపులర్ కమెడియన్లలో సంతానం ఒకరనే సంగతి తెలిసిందే.
చాలామంది కమెడియన్లు ఎంట్రీ ఇస్తున్నా సంతానంకు గట్టి పోటీ ఇచ్చే విషయంలో వాళ్లు ఫెయిలవుతున్నారు. విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో అజిత్ కొత్త మూవీ తెరకెక్కనుండగా ఈ సినిమాలో కీలక పాత్ర కోసం సంతానం ఏకంగా 8 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది.
ఈ మొత్తం తెలుగులో కొంతమంది మిడిల్ రేంజ్ హీరోల పారితోషికంతో పోల్చి చూస్తే ఎక్కువ మొత్తం కావడం గమనార్హం.

హీరోల రేంజ్ లో స్టార్ కమెడియన్ రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాలు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నాయి.లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.సంతానం రేంజ్ కు ఈ పారితోషికం ఎక్కువని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.60 కాల్షీట్స్ కోసం సంతానం ఈ మొత్తం డిమాండ్ చేశారని బోగట్టా.భారీ పారితోషికాల వల్లే కొంతమంది నిర్మాతలు ఇండస్ట్రీకి దూరమవుతున్నారు.

సంతానం లాంటి కమెడియన్లు సైతం ఎక్కువ మొత్తం పారితోషికం డిమాండ్ చేయడం వల్ల ఇండస్ట్రీకి భారీగా నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి.సినిమా ఇండస్ట్రీకి చెందిన పెద్దలు పారితోషికం విషయంలో తగిన చర్యలు తీసుకుంటే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న వార్తల గురించి సంతానం స్పందించాల్సి ఉంది.సంతానంకు రోజురోజుకు ప్రేక్షకుల్లో క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.







