ఈసారి వింటర్ సీజన్‌లో తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగానే పెరిగింది.సాధారణంగా టెంపరేచర్ 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోతే భారతీయులు వణికిపోతారు.
అలాంటిది ఈసారి కొన్ని ప్రాంతాల్లో ఐదు డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్ నమోదయింది.దాంతో వారందరూ చలి పులికి తట్టుకోలేక ఇళ్లకే పరిమితమయ్యారు.
అయితే మైనస్ డిగ్రీలోకి వెళ్తే ఇక భారతీయుల పరిస్థితి ఏమవుతుందో ఊహించుకుంటేనే భయమవుతోంది.అలాంటిది ఆఫ్ఘనిస్తాన్‌లో ఉష్ణోగ్రతలు ఏకంగా మైనస్ 33 డిగ్రీల సెల్సియస్ (-27 ఫారెన్‌హీట్)కి పడిపోతున్నాయి.
సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలలో బతకడమే కష్టం అనుకుంటే ఇక్కడ ఏకంగా -33 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ గడ్డకట్టే ఉష్ణోగ్రతలలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు.ఇప్పటికే కనీసం 70 మంది మరణించారని అధికారులు బుధవారం చెప్పారు.ఒకవైపు తీవ్రమైన చలి, మరోవైపు పేదరికం వల్ల ఈ దేశ ప్రజల పరిస్థితి మరింత ఘోరంగా మారిందని స్థానిక మీడియా తెలిపింది.
జనవరి 10 నుంచి కాబూల్, అనేక ఇతర అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.గత కొన్ని సంవత్సరాల్లో ఈరోజు లో ఉష్ణోగ్రతలు పడిపోలేదు.అకస్మాత్తుగా చలి తీవ్రత పెరిగిపోవడంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు, నిరాశ్రయులైన కుటుంబాలు పొద్దస్తమానం చలిమంటల ముందే సమయం గడుపుతున్నారు.ఈ నేపథ్యంలో ఇంకొద్ది రోజులపాటు ఈ చలి తీవ్రత అధికంగానే ఉంటుందని.
ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తాలిబన్ అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా గత ఎనిమిది రోజులు సమయంలో ఆఫ్ఘనిస్తాన్‌లో 70 మంది పేదవారు, 70 వేల పశువులు మృత్యువాత పడ్డాయని విపత్తు నిర్వహణ మంత్రిత్వ శాఖ తెలిపింది.ఈ దేశంలోని సుమారు నాలుగు కోట్ల వరకు ప్రజలు ఉండగా వారిలో సగానికి పైగా ప్రజలు ఈ చలి వల్ల ప్రభావితం అవుతున్నారు.అలానే ఆకలితో అలమటిస్తున్నారు.