'RC15' లేటెస్ట్ అప్డేట్.. బ్యూటిఫుల్ సాంగ్ కంపోజర్ గా స్టార్ కొరియోగ్రాఫర్!

అగ్ర దర్శకుల్లో డైరెక్టర్ శంకర్ ఒకరు.ఈయన ఏ సినిమా చేసిన అది భారీ స్థాయిలోనే ఉంటుంది.

ఇక ఈ ఇండియన్ జేమ్స్ కేమరూన్ ప్రెజెంట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమ చేస్తున్నాడు.RC15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా కావడంతో చరణ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిన తర్వాత మొదటి సినిమా కావడంతో ఈ సినిమా విషయంలో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా కూడా ఆయన మార్క్ కు తగ్గట్టుగానే ఉండేలా చాలా జాగ్రత్తలతో ప్లాన్ చేస్తున్నాడు.

ఆర్సీ 15 ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందనే విషయం తెలిసిందే.ఈ సినిమా ఇలా ఉండగానే ఈ సినిమా షూటింగ్ కు తో పాటు శంకర్ ఇండియన్ 2 సినిమా కూడా షూట్ చేస్తున్నాడు.

రెండు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షూటింగ్ చేస్తున్నాడు.ఇది ఇలా ఉండగా ఈ సినిమా నుండి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది.ఈ సినిమా ప్రెజెంట్ రాజమండ్రి లో షూటింగ్ జరుపు కుంటుంది.

Advertisement

వీలైనంత తొందరగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ఫాస్ట్ గా షూట్ పూర్తి చేస్తున్నారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక బ్యూటిఫుల్ సాంగ్ కు స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కంపోజర్ గా చేసారని.డ్యాన్స్ మూమెంట్స్ సూపర్ గా కంపోజ్ చేసినట్టు టాక్.శంకర్ రేంజ్ కు తగ్గట్టుగా ఈ సాంగ్ ను అదిరిపోయే రేంజ్ లో చిత్రీకరించారని.

ఈ సాంగ్ ఈ సినిమాకే హైలెట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.

అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఎస్ ఎస్ థమన్ ను తీసుకోగా.దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.మరి మొదటిసారి వస్తున్న ఈ కాంబో ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

పాకిస్థాన్ ఆర్మీ దారుణం.. మోదీని పొగిడిన యూట్యూబర్లను ఉరేసి చంపేసింది?
Advertisement

తాజా వార్తలు