తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత కరోనా కట్టడి విషయంలో స్టాలిన్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.సీఎం పీఠం ఎక్కిన వెంటనే రెండు వారాల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేసిన స్టాలిన్ .
రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల విషయంలో గుడ్ న్యూస్ ప్రకటించింది.రాష్ట్రంలో ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది.
పరీక్షలు రద్దు చేయడానికి ముందు మూడు రోజులపాటు మేధావులతో మరియు ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించి అనంతరం నిర్ణయం తీసుకోవడం జరిగింది.

ఈ క్రమంలో మార్కులు కేటాయించే విషయంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.త్వరలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉండటంతో తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది.తమిళనాడులో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత అధికంగా ఉండటంతో భారీగా కేసులు పెరగటంతో పాటు మరణాలు సంభవించడం తో .థర్డ్ వేవ్ ముప్పు ఉందని హెచ్చరికలు కూడా పై స్థాయి నుండి రావడంతో.స్టాలిన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారట.
అంత మాత్రమే కాక జాతీయస్థాయి పరీక్షల్లో కూడా రద్దు చేయాలి అంటూ తాజాగా మోడీకి లెటర్ రాయడం జరిగింది.
.