స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ మిలమిల మెరవాలంటే....బెస్ట్ టిప్స్

కిచెన్ లో ఎక్కువగా స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ ని వాడుతూ ఉంటాం.

అవి మిలమిల మెరవకుండా మురికిగా ఉంటే చూడటానికి అసహ్యంగా ఉండటమే కాక ఏదైనా వంట చేయాలన్న చికాకు కలుగుతుంది.

స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది.కాబట్టి వీటిని సరైన పద్దతిలో మెయిన్ టైన్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

కాబట్టి ఇప్పుడు స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ ని ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం.స్టైన్ లెస్ స్టీల్ అప్లయిన్స్ ని సోప్ వాటర్ తో శుభ్రం చేసాక డస్టింగ్ స్ప్రే తప్పనిసరిగా వాడాలి.

ఈ విధంగా చేస్తే పాత్రలు మిలమిల మెరుస్తాయి.

Advertisement

క్లబ్ సోడాని ఉపయోగించి మంట కారణంగా వచ్చే మరకలు,చారలు తొలగించుకోవచ్చు.స్టెయిన్ లెస్ స్టీల్ పై కొన్ని చుక్కలు బేబీ ఆయిల్ ని వేసి బాగా రుద్దితే వాటి మీద ఉన్న మరకలు సులభంగా తొలగిపోయి మిలమిల మెరుస్తాయి.వైట్ వినేగార్ ని స్ప్రే బాటిల్ లోకి తీసుకుని స్టైన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ పై స్ప్రే చేసి మెత్తని క్లాత్ తో తుడిస్తే మంచి ఫినిషింగ్ వస్తుంది.

అలాగే వెనిగర్ స్టైన్ లెస్ స్టీల్ అప్లయన్సెస్ పై ఉండే మురికిని కూడా తొలగిస్తుంది.చాలా కాలం పాటు పేరుకుపోయిన మరకలని తొలగించేందుకు టూత్ బ్రష్ బాగా సహాయపడుతుంది.

తడి టూత్ బ్రష్ తో ఎండిపోయి పాత్రలకి అంటుకుపోయిన ఆహారం, దుమ్ము లేదా మిగతా మెటీరియల్ ని బాగా రుద్దాలి.ఆ తరువాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేయాలి.

వైరల్ వీడియో : టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించిన చిన్నారులు..

Advertisement

తాజా వార్తలు