Sri Vishnu : మొత్తానికి తనకు అచ్చోచ్చిన జోనర్ లోనే ఫిక్స్ అవుతున్న శ్రీవిష్ణు

శ్రీ విష్ణు( Sri Vishnu ) .గత ఏడాది సామజ వరాగమన అనే చిత్రంతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.

మళ్ళీ తన తదుపరి చిత్రాన్ని కూడా ప్రకటించి దానికి సంబంధించిన ఫస్ట్ గ్లిమ్స్ ని కూడా విడుదల చేసి ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.అయితే శ్రీ విష్ణు తన బలాన్ని తెలుసుకున్నాడో లేక తాను ఒక ప్రత్యేకమైన జోనర్ కి పరిమితం అవ్వాలనుకుంటున్నాడో తెలియదు కానీ మొదటి నుంచి ప్రయోగాలు చేయడంలో శ్రీ విష్ణు ముందు ఉంటున్నాడు.

అయితే కొన్నిసార్లు తను చేసిన ప్రయోగాలు మిస్ ఫైర్ కూడా అయ్యాయి.అలాగనీ తాను తన పోరాటాన్ని ఆపలేదు.

వరుస సినిమాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ప్రయత్నం చేస్తూనే వచ్చాడు.ముఖ్యంగా ఇటీవల కాలంలో ఆయన నటిస్తున్న సినిమాలను గమనిస్తే మనకు విషయం అర్థమవుతుంది.

Advertisement

శ్రీ విష్ణు కి సంబంధించినంత వరకు అతని బలం కామెడీ మాత్రమే.కామెడీని ఆధారంగా చేసుకుని అతను చేసిన ప్రతి సినిమా విజయవంతం అయింది.ఉన్నది ఒకటే జీవితం అనే చిత్రం వరకు కేవలం చిన్న ఆర్టిస్ట్ గానే పనిచేస్తూ వచ్చాడు.

మొదట్లో జూనియర్ ఆర్టిస్ట్ ( Junior Artist ) వేషాలు వేసిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎదిగాడు.మెంటల్ మదిలో ( mental madilo )సినిమాతోనే ప్రాపర్ హీరోగా ఎలివేట్ అయ్యాడు.

ఆ తర్వాత నుంచి అతడు ప్రాపర్ కామెడీ ఉన్న జోనర్ లోనే ఎక్కువ చిత్రాలు తీస్తూ వచ్చారు.బ్రోచేవారెవరురా, రాజరాజ చోర, అర్జున పాల్గొన, తిప్పరా మీసం, గాలి సంపత్ వంటి కామెడీ సినిమాలు తీసి విజయవంతం అయ్యాడు శ్రీ విష్ణు.

మధ్యలో ఒకటి రెండు సినిమాలు కాస్త అటు ఇటు అయినా కూడా మళ్లీ తనలో ఉన్న కామెడీకి పదును పెట్టి ఓం భీమ్ బుష్ అనే ఒక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమా కూడా పూర్తి కామెడీ తోనే రూపొందుతుంది.మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ కురిపిస్తుందో ? ఇది కాకుండా మరొక చిత్రానికి కూడా ఇప్పటికే ప్రకటించాడు.స్వాగ్ అనే పేరును కూడా ఖరారు చేసారు ఇది 2025వ సంవత్సరంలో విడుదలవుతుంది.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు